సాయం కోసం హిమాలయాలు ఘోషిస్తున్నాయి
భూతాపం అధికమవుతున్న పరిస్థితుల్లో హిమాలయాల్లోని హిమానీనదాలు ఆందోళనకర స్థాయిలో కరిగిపోతున్నాయని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లలో నేపాల్ పరిధి హిమాలయ పర్వత శ్రేణుల్లో మూడింట ఒకవంతు మంచు కరిగిపోయిందని, భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్ వాయు కాలుష్యమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రపంచ దేశాలు తగిన కార్యాచరణకు ఉపక్రమించాలని, పర్వతమయ దేశాలకు అత్యవసరంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
భూతాపం అధికమవుతున్న పరిస్థితుల్లో హిమాలయాల్లోని హిమానీనదాలు ఆందోళనకర స్థాయిలో కరిగిపోతున్నాయని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లలో నేపాల్ పరిధి హిమాలయ పర్వత శ్రేణుల్లో మూడింట ఒకవంతు మంచు కరిగిపోయిందని, భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్ వాయు కాలుష్యమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రపంచ దేశాలు తగిన కార్యాచరణకు ఉపక్రమించాలని, పర్వతమయ దేశాలకు అత్యవసరంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. మంచు కనుమరుగైపోతే గంగ, బ్రహ్మపుత్ర తదితర హిమాలయ నదులు తీవ్ర నీటి ఎద్దడికి గురవుతాయని హెచ్చరించారు. సాయం కోసం పర్వతాలు ఘోషిస్తున్నాయని, దుబాయ్‌లో నిర్వహిస్తున్న కాప్ 28 సదస్సులో పర్వతమయ దేశాల ప్రత్యేక సమావేశంలో గుటెరస్ ప్రసంగించారు. సదస్సులో 150 దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, రాజులు పాల్గొని భూతాపాన్ని తగ్గించడానికి తమ వద్ద ఉన్న ప్రణాళికలను వివరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి 6వేల మందికి ఆహ్వానం
గన్నుతో బెదిరించి కూతురి మెడలో తాళికట్టించిన మామ !!
ప్రియుడు చెప్పాడని.. లేడీస్ బాత్రూంలో రహస్య కెమెరా !!
Daily Horoscope: ఆ రాశివారు ఈరోజు శుభవార్తను వింటారు