Mr Bachchan Review: హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?

Mr Bachchan Review: హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?

Anil kumar poka

|

Updated on: Aug 15, 2024 | 5:58 PM

మిరపకాయ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. దీంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్‌ సాంగ్స్‌ మాసీ హిట్టు కావడంతో.. ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈక్రమంలోనే థియేటర్లలోకి వచ్చిన మిస్టర్ బచ్చన్ ఎలా ఉన్నాడు..? ఆడియన్స్‌ను మెప్పించాడా లేదా? అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.. 

మిరపకాయ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. దీంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్‌ సాంగ్స్‌ మాసీ హిట్టు కావడంతో.. ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈక్రమంలోనే థియేటర్లలోకి వచ్చిన మిస్టర్ బచ్చన్ ఎలా ఉన్నాడు..? ఆడియన్స్‌ను మెప్పించాడా లేదా? అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం..

బచ్చన్ అలియాస్ రవితేజ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో సిన్సియర్ ఆఫీసర్. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి మీద ఐటి రైడ్ చేసి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత ఊరికి వచ్చి ఆర్కెస్ట్రా పెట్టుకొని ఉంటాడు. అదే సమయంలో జిక్కి అలియాస్ భాగ్యశ్రీ బోర్సేని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకునే సమయానికి మళ్లీ ఇన్కమ్ టాక్స్ ఆఫీసు నుంచి సస్పెన్షన్ ఎత్తివేసినట్టు ఆర్డర్ వస్తుంది. ముత్యం జగ్గయ్య అలియాస్ జగపతిబాబు మీద ఐటి రైట్స్ చేయాలని చెప్తారు. లాంగెస్ట్ ఐటి రైడ్ చేసిన తర్వాత కొన్ని వందల కోట్లు వాళ్ళ ఇంట్లో పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. మిస్టర్ బచ్చన్ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది అసలు కథ..

కొన్ని సినిమాలకు కాంబినేషన్ తోనే పని.. కథతో కాదు..! మిస్టర్ బచ్చన్ కూడా అలాంటి సినిమానే. మాకు కొత్తదనం వద్దు.. పరమ రొటీన్ అయినా పర్లేదు అనుకుంటే ఈ బచ్చన్ మెప్పిస్తాడు. ఫ్యాన్స్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ రవితేజను చూపించాడు హరీష్ శంకర్. కథకు అస్సలు సంబంధం లేని హీరో, హీరోయిన్ ట్రాక్ ఇది. నో లాజిక్ అనుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అదేంటి ఆ సీన్! అని బుర్రకు పని చెప్తే ఆఫ్ అయిపోతారు.. జస్ట్ గో విత్ ఫ్లో అనుకోవాలి.. అప్పుడే బచ్చన్ నచ్చుతాడు.

సినిమా ఫస్ట్ హాఫ్ లో హిందీ పాటలు ఎక్కువయ్యాయి. ఆ ప్లేస్ లో తెలుగు పాటలు పెట్టుంటే థియేటర్ ఊగిపోయేది..! చాలా మంది ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఇదే! అంతేకాదు ఆడియెన్‌కు సినిమాకు అక్కడే కనెక్టివిటీ మిస్ అయినట్లు కూడా అనిపిస్తుంది. అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంది. స్టోరీ అంతా ఒకేచోట జరుగుతుంది కాబట్టి బోర్ కొట్టకుండా చాలా జిమ్మిక్కులు చేశాడు హరీష్..! అందులో కొన్ని ఫ్యాన్స్ కి కికిస్తాయి. కొన్ని బోర్ ఫీలయ్యేలా చేస్తాయి.

ఇక రవితేజ, జగపతి బాబు మధ్య సీన్స్ బాగున్నాయి.. ఓ యంగ్ హీరో కేమియో కూడా ఉంది ఈ సినిమాలో.. అది కూడా అదిరిపోయింది. నిజానికి రెయిడ్ కథలో కమర్షియల్ కోణం లేదు.. డ్రై సబ్జెక్ట్ అది.. హరీష్‌ శంకర్ పాయింట్ నచ్చి తీసుకున్నాడు అంతే! దాన్ని కమర్షియలైజ్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అందులో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్.

రవితేజకి ఈ క్యారెక్టర్ కొట్టిన పిండి. తనకు అలవాటైన పాత్రలో ఇరక్కొట్టాడు. చాలావరకు వింటేజ్ రవితేజ ను చూపించే ప్రయత్నం చేశాడు హరీష్. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ కు ప్లస్.. ఆమె గ్లామర్ నెక్స్ట్ లెవెల్. సత్య, చమ్మక్ చంద్ర కామెడీ ఓకే. మిగిలిన వాళ్ళందరూ కూడా వారి పరిధి మేర నటించారు. వీరితో పాటే ఈ సినిమాకు ప్రధానమైన పాజిటివ్ పాయింట్ మిక్కిజే మేయర్ సంగీతం. ఆయన అందించిన పాటలు సూపర్ గా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే.. మిస్టర్ బచ్చన్.. బాగా రొటీన్.. కానీ మరీ బోరింగ్ అయితే కాదు..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.