Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..

Anil kumar poka

|

Updated on: Dec 09, 2024 | 10:32 AM

తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఎంత ఫేమస్సో.. స్వామివారి ప్రసాదం లడ్డూ కూడా అంతే ఫేమస్. స్వామివారి ఆలయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన లడ్డూకి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. అనంతరమే తాము ఆరగిస్తారు, స్నేహితులకు బంధువులకు పంచుతారు. అందుకనే తిరుమలకు వెళ్ళినవారు స్వామివారి దర్శనం కోసం ఎంత సేపు ఎదురు చూస్తారో.. అదే విధంగా లడ్డు కొనుగోలు కోసం క్యూలో నిల్చుకుంటారు.

స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తుంది. ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డులు కొనుగోలు చేసుకునే వీలుని కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. భక్తులకు అందించేందుకు అదనపు లడ్డు తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని నియమించుకునెందుకు రెడీ అవుతోంది. రోజుకి శ్రీవారిని సుమారు 65 వేల నుంచి 70వేల వరకూ భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ఆవరణలో ఒక చిన్న లడ్డూని ఉచితంగా ఇస్తారు. అంటే 70 వేల లడ్డూలు రోజుకి ఉచితంగా ఇస్తున్నారు. ఇక శ్రీవారి భక్తులు అదనంగా లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. ఒకొక్కరికి నాలుగు లడ్డూలను విక్రయిస్తుంది. ప్రస్తుతం టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలను , 3,500 వడలను తయారు చేస్తోంది. ఈ స్వామివారి ప్రసాదాలను స్థానిక తిరుపతి ఆలయాలతో పాటు, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులోని శ్రీవారి ఆలయాల్లో విక్రయిస్తున్నారు.

అయితే సాధారణ రోజులల్లో శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు వంటి సమయంలో శ్రీవారి లడ్డూకి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సముయంలో లడ్డూలకు కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అదనంగా శ్రీవారి ప్రసాదాలను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లడ్డు పోటు తయారీ అదనపు సిబ్బంది నియమాలను చేపట్టింది. 74 మంది శ్రీవైష్ణవులు, 10 మంది శ్రీవైష్ణవేతరులను లడ్డూ తయారీ కోసం నియమించాలని టీటీడీ నిర్ణయించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.