ఆధార్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 14 వరకూ గడువు పెంచిన ఉడాయ్
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు వినియోగం ఎంతో కీలకంగా మారింది. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ వంటి అనేక వాటికి ఆధార్ తప్పనిసరి అయ్యింది. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం.
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు వినియోగం ఎంతో కీలకంగా మారింది. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ వంటి అనేక వాటికి ఆధార్ తప్పనిసరి అయ్యింది. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. దీంతోపాటు ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆధార్‌లో మార్పులు, చేర్పులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే పదేళ్ల క్రితం.. నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది. ఉచితంగా ఆధార్ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉడాయ్ అధికార వెబ్‌సైట్ http://myaadhar.uidai.gov.inలో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వినాయకుడి చేతిలో లడ్డూలు.. దేనికోసం దొంగిలిస్తున్నారో తెలుసా ??
మరింత క్లిష్టంగా మారిన.. పడవల తొలగింపు ప్రక్రియ
ఆ షాపులో జ్యూస్ లో యూరిన్ కలిపి విక్రయం
Sunita Williams: నవంబర్‌లో అమెరికా ఎన్నికలు.. అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం..
Kim Jong Un: కిమ్ కవ్వింపు చర్య.. యురేనియం ప్లాంట్ ఫొటోస్ రిలీజ్