చూస్తుండగానే నడిరోడ్డుపై భారీ గొయ్యి !! కాస్తయితే మింగేసేదే !!
హైదరాబాద్ సిటీలో షాకింగ్ ఘటన ఇది. నడి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటన మియాపూర్ దీప్తిశ్రీ నగర్ కాలనీ ప్రధాన రహదారిలో జరిగింది. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు... పాదచారులు చూసి ఆందోళనతో పక్కకు పరుగులు తీశారు... రోడ్డు కుంగటంతో భారీగా గొయ్యి ఏర్పడింది. ఇటీవల కాలంలో కొత్తగా రోడ్డు వేశారు.
హైదరాబాద్ సిటీలో షాకింగ్ ఘటన ఇది. నడి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటన మియాపూర్ దీప్తిశ్రీ నగర్ కాలనీ ప్రధాన రహదారిలో జరిగింది. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు… పాదచారులు చూసి ఆందోళనతో పక్కకు పరుగులు తీశారు… రోడ్డు కుంగటంతో భారీగా గొయ్యి ఏర్పడింది. ఇటీవల కాలంలో కొత్తగా రోడ్డు వేశారు. అప్పడు కూడా బాగానే ఉందని.. అకస్మాత్తుగా ఇంత పెద్ద గొయ్యి ఏర్పడడం కలకలం రేపుతోంది. నిత్యం లక్షల మంది జనం ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు. గొయ్యి ఏర్పడిన సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్ అండ్ బీ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్ లు ఉన్నాయి… స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లీంచారు. గొయ్యి ఎందుకు ఏర్పడింది.. కారణాలు ఏంటీ అనేది అధికారులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆధార్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 14 వరకూ గడువు పెంచిన ఉడాయ్
వినాయకుడి చేతిలో లడ్డూలు.. దేనికోసం దొంగిలిస్తున్నారో తెలుసా ??
మరింత క్లిష్టంగా మారిన.. పడవల తొలగింపు ప్రక్రియ
ఆ షాపులో జ్యూస్ లో యూరిన్ కలిపి విక్రయం
Sunita Williams: నవంబర్‌లో అమెరికా ఎన్నికలు.. అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

