Sunita Williams: నవంబర్‌లో అమెరికా ఎన్నికలు.. అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం..
అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. బ్యాలెట్ కోసం తమ అభ్యర్థనను కిందకు పంపించామనీ తమ విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుందని బుచ్ విల్‌మోర్ తెలిపారు.
అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. బ్యాలెట్ కోసం తమ అభ్యర్థనను కిందకు పంపించామనీ తమ విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుందని బుచ్ విల్‌మోర్ తెలిపారు. అనంతరం సునీత మాట్లాడారు. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. బోయింగ్ తమను విడిచివెళ్లడంతో మరికొన్ని నెలలు కక్ష్యలోనే గడపాల్సి ఉందనీ అయినా, అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందనీ ఇదంతా తమ విధుల్లో భాగంగానే భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కుటుంబసభ్యులను మిస్ అవుతున్నప్పటికీ ఇక్కడ ఉండటం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని విల్‌మోర్ కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kim Jong Un: కిమ్ కవ్వింపు చర్య.. యురేనియం ప్లాంట్ ఫొటోస్ రిలీజ్
సెల్ఫీ దిగాలంటేనే భయపడుతున్న రవీనా టండన్
Kaun Banega Crorepati: పవన్ కల్యాణ్‌పై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న