Vijay Deverakonda: నాకు నేనే ఆ శిక్ష విధించుకున్నా.! విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అప్పట్లో విజయ్ మాటతీరుపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా విజయ్ స్పందించారు. లైగర్‌కు ముందు.. తర్వాత తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదనీ కాకపోతే ఒక విషయంలో జాగ్రత్త పడుతున్నాననీ అన్నారు. సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకుని నాటి నుంచి అదే అమలు చేస్తున్నట్లు చెప్పారు.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అప్పట్లో విజయ్ మాటతీరుపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా విజయ్ స్పందించారు. లైగర్‌కు ముందు.. తర్వాత తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదనీ కాకపోతే ఒక విషయంలో జాగ్రత్త పడుతున్నాననీ అన్నారు. సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకుని నాటి నుంచి అదే అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది నాకు నేనే విధించుకున్న శిక్ష అన్నారు. ఇక ఫ్యామిలీస్టార్ గురించి చెబుతూ.. మనకు ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి ప్రతి కుటుంబలో ఉంటారు ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్ అన్నారు. తన కుటుంబంలో అది తన నాన్న అనీ… దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే తనకు తన నాన్నే గుర్తొచ్చారనీ అందుకే తన పాత్రకు కూడా ఆయన పేరే పెట్టినట్లు చెప్పారు. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుంటేనే ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుందనీ అన్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు హీరో విజయ్ దేవరకొండ. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు విజయ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.