Chiranjeevi – Nagababu: నాగబాబుపై చిరంజీవికి కోపం.! చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్న చిరు
చిరంజీవి సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగానూ ఎంతోమందికి చేరువయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఏ విషయంలోనైనా తనకు అన్నయ్యే స్ఫూర్తి అని చెబుతుంటారు. చిన్నప్పుడు ఎప్పుడైనా నాగబాబును మీరు కొట్టారా?’ అని చిరంజీవిని ఓ సందర్భంలో ప్రశ్నించగా ఇలా చెప్పుకొచ్చారు.
చిరంజీవి సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగానూ ఎంతోమందికి చేరువయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఏ విషయంలోనైనా తనకు అన్నయ్యే స్ఫూర్తి అని చెబుతుంటారు. చిన్నప్పుడు ఎప్పుడైనా నాగబాబును మీరు కొట్టారా?’ అని చిరంజీవిని ఓ సందర్భంలో ప్రశ్నించగా ఇలా చెప్పుకొచ్చారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నాగబాబు ఆరో, ఏడో చదువుతున్నాడన్నారు. ఆ సమయంలో అమ్మకు అన్ని విషయాల్లో సహాయపడుతూ, పనులన్నీ తానే చేసేవాడిననీ చిరంజీవి చెప్పారు. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకురావడంతో పాటు, మరో చోటుకి కూడా వెళ్లాల్సి వచ్చిందన్నారు. రెండు పనులూ ఒకే సమయంలో చేయాల్సి రావడంతో నాగబాబుకు ఓ పని అప్పజెప్పానన్నారు. తాను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా అని నాగబాబుకు చెప్పాననీ చిరు అన్నారు. తాను పని చూసుకుని వచ్చి బట్టలు తెచ్చావా? అని అడిగితే తీసుకురాలేదు అని నాగబాబు చెప్పాడన్నారు.
ఎందుకు తేలేదు’ అని అడిగితే.. నిద్ర పోతున్నాఅనడంతో తనకు విపరీతమైన కోపం వచ్చి కొట్టేశానంటూ.. నవ్వుతూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు చిరు. చిరంజీవి-నాగబాబు కలిసి పలు సినిమాల్లో నటించారు. అంజి సినిమాలో చిరంజీవిని పెంచి పెద్ద చేసిన వ్యక్తిగా నటించారు నాగబాబు. ఆ పాతలో చిరుని ‘ఒరేయ్’, ‘ఏరా’ అంటూ పిలవాల్సి ఉండగా, తాను అన్నయ్యను అలా పిలవలేనని చెప్పారట. విషయం చిరంజీవి దృష్టికి వెళ్లిందట. దాంతో చిరు వచ్చి మనం కేవలం ఆ పాత్రల్లో నటిస్తున్నామంతే. పర్వాలేదు పిలువు అని చెబితే అప్పుడు ఒప్పుకున్నారట నాగబాబు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.