Chandrababu Naidu Season 4: తన అరెస్ట్ గురించి చెబుతూ చంద్రబాబు ఎమోషనల్
నట సింహం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు. అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈక్రమంలోనే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక అందులో.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన అరెస్ట్ గురించి స్పందించడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
ఇక ప్రోమోలో.. ‘మా బావగారు.. మీ బాబు గారు’ అంటూ బాలయ్య ఇచ్చిన ఇంట్రో ఆకట్టుకుంటోంది. ఇక షోలో అన్ని నిజాలే మాట్లాడుతానని బాలయ్య బాబు.. చంద్రబాబుతో ప్రమాణం చేశాయించారు. అయితే సమయస్ఫూర్తితో సమాధానం చెప్తానంటూ చంద్రబాబు చమత్కరించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మొదటి రోజు రాత్రి జైలులో ఎలా గడిచిందో చెప్తూ ఉద్వేగానికి గురయ్యారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టబోమని చంద్రబాబు అన్నారు. ఇక జైలు గోడల మధ్య బాబు-పవన్ మధ్య ఏం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక థింక్ గ్లోబలీ.. యాక్ట్ గ్లోబలీ తన స్లోగన్‌తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం మీద ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలు అందరికీ తెలిసే అవకాశాలు ఉన్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ఫుల్ ఎపిపోడ్ వైపే అందరూ ఈగర్‌గా ఎదురు చూసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీరిద్దరూ విడిపోవడానికి.. ఆ హీరోయినే కారణమా ??
Ram Charan: వచ్చే వేసవి నాటికి చెర్రీ మైనపు విగ్రహం రెడీ !!
బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష.. కొంటే మంచిదేనా ??
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్ !!
Aadhar Card: మీ ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

