రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్ !!
సాధారణంగా పెసర్లతో పెసరట్లు, వడలు ఇలా రకరకాల వంటకాలు చేసుకుని తింటారు. వీటిలో ఫేమస్.. ఉప్మా పెసరట్టు. అల్లం, పచ్చి మిర్చి వేసి, కొద్దిగా ఉప్మా పెట్టి.. నెయ్యి వేసి చక్కగా రోస్ట్ చేసుకొని తింటే.. అదిరిపోతుంది. అదంతా దాని రుచి మహిమ. దీనికి సాటి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడెవరూ దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కరోనా పుణ్యమా అని చాలా ఆహారాలకు స్వస్తి చెప్పేశారు.
అందరూ మొలకలు తినడం మొదలు పెట్టారు. అయితే ఈ మొలకలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే లభిస్తాయి. నానబెట్టాక మొలకలు వచ్చాక కొందరు తింటే.. ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో కొందరు తింటారు. ఎలా తిన్నా ఇవి టేస్టీగానే ఉంటాయి. గ్యాస్ అని చాలా మంది వీటిని పక్కన పెట్టేశారు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ ఉడకబెట్టినవి ఓ గుప్పెడు తిన్నా చాలా మంచిది. పెసర్లలో విటమిన్లు బి2, బి3, బి5, బి6, బి1, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ఫొటాషియం, ఫోలేట్, జింక్, ఫైబర్, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. పెసలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకుంటారు. అలసట, నీరసం దరి చేరకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aadhar Card: మీ ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి ??
TOP 9 ET News: గంగవ్వకు గుండెపోటు వచ్చిందా ?? క్లారిటీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

