Aadhar Card: మీ ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి ??
12 అంకెల కార్డు మన గుర్తింపు అయిపోయింది.. అదే ఆధార్ కార్డు. దేశంలోని ప్రజలందరికీ ఆధార్ కార్డు అత్యంత అవసరం. ఒక రకంగా పౌరులందరికీ గుర్తింపు అని చెప్పవచ్చు. నిత్యం నిర్వహించే ప్రతి పనికీ ఇది అవసరమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం పథకాలను పొందటానికి చాలా అవసరం. ఆస్తి, వాహనాలు, వస్తువులను కొనాలన్నా, విక్రయించాలన్నా ఆధార్ కార్డు లేకపోతే కుదరదు.
పిల్లల నుంచి పెద్దల వరకూ 12 అంకెలతో కూడిన కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తోంది. దీనిలో పేరు, చిరునామా, వయసు, ఫోన్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి. ఆ వివరాలు సక్రమంగా లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వాటిని సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. దోషాలు ఉంటే సరిచేసుకోవాలి. అయితే ఆధార్ కార్డులో మార్పులకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)ద్వారా ఆధార్ కార్డు జారీ అవుతుంది. బయో మెట్రిక్, డెమో గ్రాఫిక్ డేటా ఆధారంగా దాన్ని రూపొందిస్తారు. ఆధార్ కార్డులో 12 అంకెల నంబర్ కేటాయిస్తారు. అదే మనకు గుర్తింపు గా ఉపయోపడుతుంది. అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు, బతుకుదెరువు కోసం ప్రజలు ఒకచోట నుంచి మరోచోటుకు వలస వెళతారు. అప్పుడు ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు కూడా పలు నిబంధనలు వర్తిస్తాయి. ఆధార్ కార్డులో పేరును మార్పు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా కేవలం రెండు సార్లు మాత్రమే చేసుకోవచ్చు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: TOP 9 ET News: గంగవ్వకు గుండెపోటు వచ్చిందా ?? క్లారిటీ
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

