వీరిద్దరూ విడిపోవడానికి.. ఆ హీరోయినే కారణమా ??

వీరిద్దరూ విడిపోవడానికి.. ఆ హీరోయినే కారణమా ??

Phani CH

|

Updated on: Oct 23, 2024 | 1:51 PM

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోయారనే వార్తలు గత కొన్ని నెలలుగా హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏవైనా ఈవెంట్లకు విడివిడిగానే వెళ్తున్నారు ఐశ్వర్య, అభిషేక్. అయితే ఇప్పుడు అభిషేక్, ఐశ్వర్య విడిపోవడానికి ఓ బాలీవుడ్ నటి కారణమని అంటున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ నుండి విడిగా జీవిస్తోందని సమాచారం.

తన కూతురు ఆరాధ్యతో కలిసి తన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకునే ఆలోచన చేయడం లేదు. అయితే ఇందులో ఐశ్వర్యకు భర్త నుంచే సమస్య వచ్చిందని అంటున్నారు. అభిషేక్ బచ్చన్ తన సినిమా జీవితం గురించి అభద్రతాభావంతో ఉన్నాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో అతను నటి నిమ్రత్ కౌర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కూడా సమాచారం. ఈ వార్త ఆయన అభిమానులకు షాకిస్తోంది. ఇది నిజం కాకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాలు, సిరీస్ లేవీ ఇటీవల పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. అదే సమయంలో ‘దస్వీ’ సినిమా షూటింగ్ సమయంలో నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ కు సాన్నిహిత్యం ఏర్పడిందని సమాచారం. ఇదే క్రమంలో అభిషేక్, నిమ్రత్ కౌర్ ఇప్పుడు డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఈ నటి కారణంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్‌ని మోసం చేశాడని, ఇప్పుడు వారిద్దరూ ఒకే ఇంట్లో నివసించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నిమ్రత్ కౌర్ పేరు కూడా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: వచ్చే వేసవి నాటికి చెర్రీ మైనపు విగ్రహం రెడీ !!

బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష.. కొంటే మంచిదేనా ??

రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్ !!

Aadhar Card: మీ ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి ??

TOP 9 ET News: గంగవ్వకు గుండెపోటు వచ్చిందా ?? క్లారిటీ