Vijay Devarakonda: ట్రాన్స్‌జెండర్‌కు విజయ్ సాయం.. దేవుడివయ్యా.. అంటూ ఎమోషనల్.

Vijay Devarakonda: ట్రాన్స్‌జెండర్‌కు విజయ్ సాయం.. దేవుడివయ్యా.. అంటూ ఎమోషనల్.

Anil kumar poka

|

Updated on: Jul 12, 2024 | 11:47 AM

సినిమాల సంగతి పక్కన పెడితే.. చూడ్డానికి చాలా ఆరోగెంట్ గా కనిపించే విజయ్ దేవర కొండకు చాలా మంచి మనసు ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు సాయం చేశాడీ హ్యాండ్సమ్ హీరో. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించాడు విజయ్. ఇక ఖుషి సినిమా రిలీజ్ సమయంలో 100 పేద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటీ రూపాయలు పంచాడు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న తన ఫ్యాన్స్ కు, ప్రజలకు తన వంతు సాయం చేస్తుంటాడీ ట్యాలెంటెడ్ హీరో.

సినిమాల సంగతి పక్కన పెడితే.. చూడ్డానికి చాలా ఆరోగెంట్ గా కనిపించే విజయ్ దేవర కొండకు చాలా మంచి మనసు ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు సాయం చేశాడీ హ్యాండ్సమ్ హీరో. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించాడు విజయ్. ఇక ఖుషి సినిమా రిలీజ్ సమయంలో 100 పేద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటీ రూపాయలు పంచాడు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న తన ఫ్యాన్స్ కు, ప్రజలకు తన వంతు సాయం చేస్తుంటాడీ ట్యాలెంటెడ్ హీరో. ఈ క్రమంలో విజయ్ దేవర కొండ గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ అయ్యారు. సాయం విషయంలో విజయ్ ను దేవుడితో పోల్చుతూ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలోనే.. విజయ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఆ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ మాటలకు విజయ్ కూడా రియాక్టయ్యారు. ‘ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎక్కడి నుంచో రూ. 500, రూ. 1000 సాయం చేశారు. వారందరి వల్లే ఇది సాధ్యమైంది. ఇంత మంచి మనుషులు మన మధ్య మనం ఉండటం మన ఆశీర్వాదం’ అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. విజయ్ దేవరకొండ చేసిన మంచి పనిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.