TOP9 ET: నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | బీట్ అదిరిపోయిందిగా.. మోత మోగిస్తోన్న పుష్ప రాజ్

TOP9 ET: నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | బీట్ అదిరిపోయిందిగా.. మోత మోగిస్తోన్న పుష్ప రాజ్

Anil kumar poka

|

Updated on: Apr 25, 2024 | 7:57 AM

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి మరింత వేడెక్కింది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ నిలబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల సంఘానికి పవన్ నామినేషన్ సమర్పించారు. తన ఆస్తుల విలువ 164.5 కోట్లుగా అఫిడవిట్‌లో దాఖలు చేశారు. అలాగే 64.26 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయని అందులో మెన్షన్ చేశారు. అలాగే సామాజిక సేవలకు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం 20 కోట్లకు పైగానే విరాళాలు ఇచ్చినట్టు అందలో కోట్ చేశారు జనసేనాని.

01.pawan assets: నాకు 164 కోట్ల ఆస్తి ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి మరింత వేడెక్కింది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ నిలబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల సంఘానికి పవన్ నామినేషన్ సమర్పించారు. తన ఆస్తుల విలువ 164.5 కోట్లుగా అఫిడవిట్‌లో దాఖలు చేశారు. అలాగే 64.26 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయని అందులో మెన్షన్ చేశారు. అలాగే సామాజిక సేవలకు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం 20 కోట్లకు పైగానే విరాళాలు ఇచ్చినట్టు అందలో కోట్ చేశారు జనసేనాని.

02.pushpa: బీట్ అదిరిపోయిందిగా.. మొతమోగిస్తోన్న పుష్ప రాజ్.

అల్లు అర్జున్, సుకుమార్, డీఎస్పీ – దీన్నో బాక్సుబద్దలయ్యే కాంబినేషన్ అంటారు. ఇప్పుడు మళ్లీ అలాంటి బాక్సు బద్దలయ్యే బీట్‌నే డెలివరీ చేశారు. తాజాగా పుష్ప2 నుంచి రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోలో… డీఎస్పీ బీట్ ను పట్టేసిన బన్నీ ఫ్యాన్స్.. ఈ సాంగ్‌ బీట్‌తో సోషల్ మీడియా మోత మోగడం పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్‌ లిరికల్ వీడియో మే1st ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది.
03.pawan dance: పవన్‌కొచ్చిన ఊపుకు ఊగిపోయిన జనం

సినిమాలే కాదు.. పవన్‌ ఎలక్షన్ క్యాంపెన్స్ కూడా సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. జనాలను విపరీతంగా ఎంటర్‌ టైన్ చేస్తున్నాయి. ఇక రీసెంట్గా కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పవన్‌.. ర్యాలీలో కొడుకున్న డప్పుల మోతకు అనుగుణంగా ఊగిపోయారు. తన మూమెంట్‌తో ఒక్క సారిగా జన సైనికుల్లో.. వైబ్రేషన్స్ పుట్టించాడు. అక్కడున్న వారందర్నీ అరిపించడంతో పాటు.. నెట్టింట వైరల్ అవుతున్నారు.

04.chiranjeevi: చిరు సినిమాను రిజెక్ట్ చేసిన విజయ శాంతి?

ఒకప్పుడు చిరు విజయ్‌ శాంతి హాట్ కాంబో. అయితే ఈ కాంబోను సెట్ చేయాలని.. అట్‌లీస్ట్ ఈ ఇద్దరు స్టార్లను ఒకే సినిమాలో నటింపజేయాలని ప్లాన్ చేసిన మేకర్స్‌కు అది వీలు కావడం లేదు. ఇక రీసెంట్గా చిరు విశ్వభర సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తే బాగుంటుందని థింక్ చేసిన వశిష్ఠ.. మరో ఆలోచన చేయకుండా విజయశాంతిని అప్రోచ్ అయ్యారట. కానీ విజయ శాంతి సున్నితంగా నో చెప్పారట. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్‌కి జోడిగా నటించిన తాను.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పారట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టొదని.. అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి వివరించారట కూడా..!

05.family satr: ఫ్యామిలీ స్టార్ OTTలోకి వస్తుందోచ్‌..

హిట్టు ఫట్టు టాక్ మధ్యలో నలిగిపోయినా కూడా మంచి ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ రాబట్టిన ఫ్యామిలీ స్టార్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే5న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

06. manjummel cheating: మంజుమ్మల్ బాయ్స్‌ ప్రొడ్యూసర్ పై.. చీటింగ్ కేసు

మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సినిమా మంజుమ్మల్ బాయ్స్‌. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 250 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్స్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్స్ పై చీటింగ్ కేసు నమోదవ్వడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీ ప్రొడ్యూసర్లలో కో- ప్రొడ్యూసర్ అయిన సిరాజ్.. రిమైనింగ్ ప్రొడ్యూసర్స్ తను పెట్టిన 7 కోట్ల పెట్టుబడి విషయంలో తనను మోసం చేశారని.. లాభాల్లో 40 శాతం ఇవ్వకపోగా.. పెట్టుబడి అమౌంట్‌ కూడా ఎగ్గొట్టారని ఎర్నాకులం కోర్టును ఆశ్రయించారు. దీంతో సిరాజ్‌ ఫిర్యాదును విచారించిన కోర్టు… మంజుమ్మల్ ప్రొడ్యూసర్ పై కేసు ఫైల్ చేశాలంటే పోలీస్‌లను ఆదేశించింది.

07. prashat neel vijay: రౌడీ హీరోగా ప్రశాంత్ నీల్ మూవీ? క్లారిటీ..!

రీసెంట్‌గా విజయ్ దేవరకొండను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకున్నారు. విజయ్ ఇంటికి అతిథిగా వెళ్లారు. అందుకు సాక్ష్యంగా.. విజయ్ దేవరకొండ మేనేజర్ తో ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటో కూడా బయటికి వచ్చి నెట్టింట వైలర్ అవుతోంది. దీంతొ విజయ్ హీరోగా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మూవీ రాబోతుందనే టాక్ అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఎక్కువైంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని.. వాళ్లిద్దరూ మామూలుగానే కలిశారని తాజాగా విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలోనూ.. ఇండస్ట్రీలోనూ వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టింది.

08.prabhas, naga chaitanya: మొత్తానికి ప్రేమలో పడ్డారు..

ఇప్పుడంటే కత్తులు పట్టి.. ఊచకోత కోస్తూ పోతున్నాడు కానీ.. ఒకప్పుడు ప్రభాస్‌ అమ్మాయిలకు డార్లింగ్. లవస్టోరీల్లో ఎవర్‌గ్రీన్‌ కటౌట్. అయితే బ్యాక్ టూ థోస్ డేస్ అన్నట్టు.. ఇప్పుడు లవ్‌ స్టోరీలో కనిపించబోతున్నారట ప్రభాస్. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో మంచి లవ్‌ స్టోరీలో అందర్నీ మెస్మరైజ్‌ చేయబోతున్నారట. అప్‌కోర్స్‌ దాంతో పాటే యాక్షన్ కూడా ఎలాగూ ఉంటుంది అనుకోండి. అయితే ప్రభాస్‌ చేస్తున్న.. ఈ ఎక్ట్సా లవ్ ఎలిమెంట్ ఇప్పుడు గురించే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి ప్రేమలో పడ్డాడు ప్రభాస్ అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.

09.kgf villan to jagan: జగన్‌ అధికారం పై.. కేజీఎఫ్ విలన్ హాట్ కామెంట్స్.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం, నామినేషన్ల హడావుడిలో ఉన్నాయి. మరోవైపు హీరో విశాల్ లాంటి వాళ్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తమ మద్ధతు తెలుపుతున్నారు. మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ‘కేజీఎఫ్’ విలన్ రామచంద్రరాజు అదే చెప్పుకొచ్చారు. వైసీపీకే తన మద్ధతు అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!