కెప్టెన్ కుర్చీ మీద మనసుపడుతున్న నాయికలు
కొందరు ప్రముఖ నాయికలు నటనలో అనుభవం గడించిన తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. కీర్తి సురేష్ స్క్రిప్ట్‌లు రాస్తుండగా, శ్రుతి హాసన్ మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. అనుపమ, వరలక్ష్మి శరత్‌కుమార్ వంటి వారు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నిస్తున్నారు. గీతు మోహన్‌దాస్ వంటి వారు దర్శకురాలిగా విజయం సాధించి స్ఫూర్తినిస్తున్నారు. నటనకు మించి నెక్స్ట్ స్టెప్ గా దర్శకత్వాన్ని ఎంచుకుంటున్నారు.
ఏ ఫీల్డ్ లో అయినా ఓ స్థాయి ఎక్స్ పీరియన్స్ వచ్చాక, వాట్ నెక్స్ట్ అనే ఆలోచన ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనలోనే ఉన్నారు కొందరు నాయికలు. ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టెప్ నేచురల్‌గా పడాల్సింది డైరక్షన్ వైపే కదా అనే థాట్ ప్రాసెస్‌లో ఉన్నారు. కొందరు ఆల్రెడీ ఆ దశగా అడుగులు కూడా వేస్తున్నారు. కీర్తీ సురేష్ ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా ఓ స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. ఎలాంటి స్క్రిప్ట్ కి ప్రేక్షకులు ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతారో అనే విషయం మీద నాకో ఐడియా ఉంది. దానికి తగ్గట్టు స్టోరీ రాసుకుంటున్నాను. కమర్షియల్‌గా మామూలుగా ఉండదు అని గట్ ఫీలింగ్‌ని ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు కీర్తి. స్పెషల్‌గా మెన్షన్ చేయకపోయినా శ్రుతి కూడా అదే ప్రాసెస్‌లో ఉన్నారు. పాటలు పాడటం, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మాత్రమే కాదు, త్వరలోనే మెగాఫోన్ పట్టుకోవడానికి శ్రుతిహాసన్ రెడీ అవుతున్నారనే మాట కోలీవుడ్‌లోనూ వైరల్ అవుతోంది. నటన, మ్యూజిక్‌తో పాటు డైరక్టర్‌కి కావాల్సిన స్కిల్స్ కూడా శ్రుతిలో మెండుగా ఉన్నాయన్నది ఆమె నియర్ అండ్ డియర్స్ అబ్జర్వేషన్. ఆల్రెడీ డైరక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసి ఎక్స్ పీరియన్స్ కూడగట్టుకుంటున్నారు అనుపమ పరమేశ్వరన్. అనుపమతో పోలిస్తే వరలక్ష్మి శరత్‌కుమార్ మరో మెట్టుముందున్నారు. తన భర్త ప్రోత్సాహంతో మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయిపోయారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ప్రాపర్ హీరో, హీరోయిన్ సబ్జెక్టు కాదు, కేరక్టర్లు డ్రైవ్ చేసే సబ్జెక్టుతో ప్రూవ్ చేసుకోవాలన్నది వరలక్ష్మి మనసులో ఉన్న మాట. కేజీయఫ్ తర్వాత యష్‌లాంటి హీరోకి స్టోరీ చెప్పి మెప్పించడమంటే మామూలు విషయం కాదు. యష్, నయన్, కియారా.. ఇలా టాప్ స్టార్స్ ని మెప్పించారు లేడీ కెప్టెన్ గీతూ మోహన్‌దాస్. నటిగా మెప్పించిన ఈ లేడీ ఇప్పుడు డైరక్టర్‌గా కమర్షియల్‌గా ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలని చాలా మంది వెయిటింగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ
సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్
ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

