నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి
వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందం మానవత్వాన్ని చాటింది. సంగెం మండలం రామచంద్రపురంలో ఓ శునకం ఇంటి గేట్ గ్రిల్స్‌లో ఇరుక్కుని మూడు గంటలు నరకం అనుభవించింది. DRF సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి, కట్టర్‌తో గ్రిల్స్‌ను కట్ చేసి ఆ మూగజీవి ప్రాణాలు కాపాడారు. మనుషులతో పాటు మూగజీవుల రక్షణ కూడా తమ బాధ్యతే అని DRF నిరూపించింది.
ఎక్కడ విపత్తు జరిగినా అక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ వాలిపోతాయి..వానలైనా.. వరదలైనా.. భూ కంపాలైనా.. వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడమే DRF సిబ్బంది లక్ష్యం. అయితే ప్రజల ప్రాణాలు మాత్రమేకాదు మూగజీవుల ప్రాణాలు కాపాడడం కూడా మా బాధ్యతే అంటున్నారు వరంగల్ డిఆర్ఎఫ్ టీం. ఎరక్కపోయి ఓ ఇంటి గేట్ గ్రిల్స్ లో ఇరుక్కుపోయిన ఓ వీధి శునకం ప్రాణాలను కాపాడడం కోసం DRF టీం రెండుగంటలకు పైగా శ్రమించి ప్రాణాలు కాపాడారు. వరంగల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురం గ్రామంలో ఓ వీధికుక్క ఇంటిముందున్న గెట్ గ్రిల్స్ నుండి బయటకు వెళ్లడానికి ట్రై చేసింది. ఈ క్రమంలో ఆ గ్రిల్స్ లో శునకం తల ఇరుక్కు పోయింది. అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కి రాలేక..దాదాపు మూడు గంటలకు పైగా నరకం అనుభవించింది. ఆ కుక్క అరుపులు విని కాలనీ వాసులు బయటకు వచ్చారు. కుక్క పరిస్థితిని అర్ధం చేసుకుని విడిపించుదామనుకున్నారు. కానీ అది ఎక్కడ తమను కరుస్తుందోనని భయపడ్డారు. దీంతో DRF బృందానికి కాల్ చేసారు. సమాచారం అందుకున్న DRF సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రత్యేక వాహనంలో స్పాట్ కు చేరుకున్న సిబ్బంది సుమారు మూడు గంటల పాటు శ్రమించారు. చివరికి కట్టర్ తో గేట్ గ్రిల్స్ కట్ చేసి ఆ శునకాన్ని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అది చిన్న ప్రాణి.. మూగ జీవి.. పైగా వీధి కుక్కలతో మనుషుల ప్రాణాలకు ముప్పు… అన్నీ తెలిసినా వృత్తి ధర్మాన్ని చాటి మానవత్వం చాటుకున్న DRF టీమ్ ను గ్రామస్తులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్
రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు
క్రెడిట్ కార్డులున్నాయా ?? జాగ్రత్త పడకపోతే అప్పుల్లోకే
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

