AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??

ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??

Phani CH
|

Updated on: Nov 24, 2025 | 7:50 PM

Share

ట్రాన్స్‌-సైబీరియన్‌ రైల్వే రష్యాలో మాస్కో నుండి వ్లాడివోస్టాక్ వరకు విస్తరించిన ప్రపంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. 9,289 కి.మీ.ల ఈ ప్రయాణంలో సైబీరియా మంచు పర్వతాలు, అటవీ ప్రాంతాలు, వోల్గా నది, బైకాల్ సరస్సు వంటి అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇది పర్యాటకంతో పాటు దేశ వాణిజ్యానికి కీలకమైన మార్గం.

ట్రాన్స్‌సైబీరియన్‌ రైల్వే లైన్‌.. ప్రపంచంలో అతిపెద్ద దేశమైన రష్యాలో.. తూర్పు-పశ్చిమ దిక్కులను కలుపుతూ ‘ట్రాన్స్‌-సైబీరియన్‌ రైల్వే లైన్‌’ సేవలు అందిస్తోంది. మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు ఈ లైన్‌ విస్తరించి ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు.. 8 టైమ్‌ జోన్స్‌.. 80కి పైగా రైల్వేస్టేషన్ల మీదుగా.. 8 రోజుల్లో 9,289 కిలోమీటర్లు ప్రయానిస్తాయి. అయితే రైలు ప్రయాణంలో నగరాలు, గ్రామాలు, సైబీరియా మంచు పర్వతాలు-మైదానాలు, విస్తారమైన అడవులు.. వోల్గాతో పాటు ఇతర నదులు కనువిందు చేస్తాయి. రష్యాలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవచ్చు. ఈ రైలు మార్గంలో ప్రయాణించేవారు సరికొత్త అనుభూతిని పొందుతారు. ప్రపంచంలోనే అత్యంత లోతైన బైకాల్‌ సరస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రైల్వే నిర్మాణాన్ని 1891లో అప్పటి రష్యా చక్రవర్తి అలెగ్జాండర్ ద థర్డ్‌ ఆదేశాలతో ప్రారంభించారు. ఆయన కుమారుడు నికొలస్ ద సెకండ్‌ కూడా దీని నిర్మాణాన్ని పర్యవేక్షించారు. 1916లో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎంతోమంది ఈ ప్రాజెక్టుపై డాక్యుమెంటరీలు నిర్మించారు. ఈ రైల్వే లైన్‌ ఆదాయం తెచ్చిపెట్టడమే కాదు.. వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడుతోంది. ప్యాసింజర్‌ రైళ్లతోపాటు భారీ సంఖ్యలో కంటైనర్లతో గూడ్స్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అలా ఈ మార్గం పశ్చిమతీరంలోని పరిశ్రమలను తూర్పున ఉన్న నౌకాశ్రయాలతో కలుపుతూ.. ఎగుమతులు, దిగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. యాంకర్‌ భారత్‌లో కూడా సుదీర్ఘ ప్రయాణమున్న ఓ రైలు మార్గముంది. అదే అస్సాంలోని డిబ్రుఘడ్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి మధ్య వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ రెండు రైల్వేస్టేషన్ల మధ్య దూరం 4,218 కిలోమీటర్లు. నాలుగు రోజులు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ రైలు ఎనిమిది రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. దాదాపు 58 స్టేషన్లలో ఆగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి

స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్

రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు

క్రెడిట్‌ కార్డులున్నాయా ?? జాగ్రత్త పడకపోతే అప్పుల్లోకే

గుండె ఆరోగ్యం కోసం సూపర్‌ డ్రింక్‌

Follow Us