AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ

ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Nov 24, 2025 | 8:20 PM

Share

గ్లామర్ రంగంలో నార్త్, సౌత్ బేధం ఇంకా కొనసాగుతోంది. నార్త్ హీరోయిన్లు హిందీ సినిమాలను ప్యాషన్ కోసం ఎంచుకుంటే, సౌత్ చిత్రాలకు రెమ్యునరేషన్ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. దీపికా పదుకోణ్ వంటి వారి సౌత్ ప్రాజెక్టుల రెమ్యునరేషన్, పని గంటలపై చర్చ జరుగుతోంది. సౌత్ సినిమాలు వారికి భారీ పారితోషికం అందిస్తున్నాయని, అందుకే అవకాశాలను వదులుకోవడం లేదని ఈ ఆర్టికల్ విశ్లేషిస్తుంది.

నార్త్ అండ్‌ సౌత్‌ అనే తేడా ఇంకా ఉందా? ఎప్పుడో ఒన్‌ సినిమా కాలేదా? అని అడిగేవాళ్లకు ‘కాలేదు’.. అని చెప్పడానికి కచ్చితంగా ఓ ఫీల్డ్ ఉంది. అది గ్లామర్‌ ఫీల్డ్. హీరోయిన్ల పరంగా ఇంకా సౌత్‌ అండ్ నార్త్ బేధం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ప్యాషన్‌ కోసం నార్త్.. బ్యాంక్‌ బ్యాలన్స్ కోసం సౌత్‌ అనేలా ఉందా సిట్చువేషన్‌.. కమాన్‌ లెట్స్ డిస్కస్‌. దీపిక పదుకోన్‌ మన దగ్గర స్పిరిట్‌ నుంచి, కల్కి సీక్వెల్‌ నుంచి తప్పుకోవడానికి కేవలం పనిగంటలే కారణమా? లేకుంటే రెమ్యునరేషన్‌ కూడానా? అనే డిస్కషన్‌ నెవర్‌ ఎండింగ్‌గా జరుగుతూనే ఉంది. నేను డబ్బులు పట్టించుకోనని దీపిక చెప్పినప్పటి నుంచి ఈ యాంగిల్‌ మరింతగా చర్చల్లో ఉంది. నార్త్ లో కాస్త్ డిమాండ్‌ ఉన్నవారికి, సౌత్‌లో దాదాపు రెట్టింపు రెమ్యునరేషన్‌ ఇస్తున్నారా? నార్త్ లో యంగ్‌స్టర్స్ తో సినిమాలు చేస్తున్నవారికి, సౌత్‌లో స్టార్స్ తో చేసే అవకాశాలు తలుపు తడుతున్నాయి. వాటికి తోడు, వాళ్ల నార్త్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్‌ పరంగానూ మనవాళ్లు బాగానే ఇస్తున్నారన్నది టాక్‌. అందుకే సౌత్‌ సినిమా ఛాన్సులను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు నార్త్ ఆర్టిస్టులు. ప్యాషన్‌ కోసం హిందీ సినిమాలు, పారితోషికం కోసం సౌత్‌ సినిమాలు అనే పంథాను ఫాలో అవుతున్నారనే మాటలు బాగానే వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు పారితోషికం బాగా ఉన్నప్పటికీ, క్రేజీ కాంబినేషన్లకే ఓటేస్తున్నారు నార్త్ హీరోయిన్లు. అందుకే ప్రతి అవకాశానికీ ఓకే చెప్పకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆలియాభట్‌లాంటివాళ్లు. చాలా మంది హీరోయిన్లు… సౌత్‌ అనగానే ఒన్లీ తెలుగు అనే ఫిక్సవుతున్నారు. మరికొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి తమిళ్‌ సినిమాలకు కూడా సైన్‌ చేస్తున్నారు. కన్నడ, మలయాళం వైపు చూస్తున్న నాయికామణుల సంఖ్య అతి స్వల్పంగానే ఉందన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్

ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??

నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి

స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్

రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు