మినిమమ్ వంద కోట్లు.. మీడియం రేంజ్ హీరోల బడ్జెట్ ఇదే
టాలీవుడ్‌లో మిడ్ రేంజ్ హీరోల చిత్రాలకు 100 కోట్లకు పైగా బడ్జెట్ సర్వసాధారణంగా మారింది. నిర్మాతలు సబ్జెక్ట్ మీద, హీరోల మీద నమ్మకంతో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. నాగచైతన్య, నిఖిల్, నాని వంటి హీరోల సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ భారీ పెట్టుబడులు విజయం సాధిస్తే లాభాలు, లేదంటే నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు హెచ్చరిస్తున్నారు, ఆచి తూచి అడుగులు వేయడం ముఖ్యం.
టాలీవుడ్‌లో ఇప్పుడు వంద కోట్లు అనే మాట చాలా మామూలైపోయింది. హండ్రెడ్ క్రోర్స్ ని వసూలు చేయడం ఎంత సేపు అనుకునేరు.. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కలెక్షన్ల వంద కోట్ల గురించి కాదు. పెట్టుబడుల వంద కోట్ల గురించి. అంత బడ్జెట్ కూడా స్టార్ హీరోలకు కాదు.. మిడ్ రేంజ్ హీరోలకు. మరి అంతంత డబ్బును ఏ నమ్మకంతో పెడుతున్నట్టు… మాట్లాడుకుందాం వచ్చేయండి…
నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? ఆ గ్రాండియర్, ఆ విజువల్స్, ఆ సెట్టింగ్స్ అంతా చూస్తుంటే మామూలుగా అయ్యేటట్టు లేదనుకుంటున్నారా? అయితే మీరనుకున్నది కరెక్టే.. వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోందట ఆ సినిమా. కార్తికేయతో ప్రూవ్ చేసుకున్న నిఖిల్ నెక్స్ట్ సినిమా స్వయంభుకి కూడా ఆ మాత్రం బడ్జెట్ పెడుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్. ఈ మధ్య వరుస సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న నేచురల్ స్టార్ నెక్స్ట్ సినిమా ది ప్యారడైజ్ బడ్జెట్ కూడా వంద కోట్ల కన్నా ఎక్కువనే మాట ఉంది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో ప్రమోషన్లను కూడా ప్లాన్ చేస్తోంది టీమ్. ప్రతిదీ ఆ వందకోట్లకు పైగా ఉన్న బడ్జెట్ లెక్కలోకే వస్తుందంటున్నారట కెప్టెన్. డీజే టిల్లుతో ప్రూవ్ చేసుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈయనతో సితార ఎంటన్‌టైన్‌మెంట్స్ నెక్స్ట్ తెరకెక్కించబోయే సినిమా బడ్జెట్ కూడా వందకన్నా ఎక్కువేనట. రెండు పార్టులుగా తెరకెక్కే ఆ సినిమా మీద హోప్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రొడక్షన్ హౌస్‌లో. ఇటు సంబరాల ఏటిగట్టు కోసం కూడా అంతే బడ్జెట్ పెడుతున్నారట మేకర్స్. మిడ్ రేంజ్ హీరోలే అయినప్పటికీ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ తో ఖర్చు చేస్తున్నారు.అంతా బావుంటే అంతకంతా రావడం గ్యారంటీ. ఏమాత్రం తేడా జరిగినా నిర్మాతలకు పెద్ద జర్క్ మాత్రం తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండిట్స్. అనవసరమైన ఖర్చు చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తే అంతా బావుంటుందనే హెచ్చరికలూ వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??
నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి
స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్
రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

