గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయి
నవంబర్ 24న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹710, 22 క్యారెట్ల బంగారంపై ₹650 తగ్గింది. కిలో వెండి ధర ₹1000 తగ్గింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో నేటి బంగారం, వెండి ధరలను తెలుసుకోండి. కొనుగోలుకు ముందు ధరలు సరిచూసుకోవడం మంచిది.
బంగారం ధరలు సామాన్యులకు అంతుచిక్కడం లేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. అయితే, నవంబరు 24 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 తగ్గి, రూ.1,25,130 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650 తగ్గి రూ.1,14,700 కి చేరింది. కిలో వెండి పై రూ.1000 తగ్గి రూ.1,63,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,25,280, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,850 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,130 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,14,700 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,670, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,25,130 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,14,700 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,63,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 11 గంటల తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ
సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్
ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

