Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనోజ్‌ చేసిన ఆ చిన్నతప్పే.. ఇంత పెద్ద లొల్లికి కారణం !!

మనోజ్‌ చేసిన ఆ చిన్నతప్పే.. ఇంత పెద్ద లొల్లికి కారణం !!

Phani CH

|

Updated on: Mar 25, 2023 | 9:39 AM

మంచు వారింటి పంచాయితీ రోడ్డు మీద పడిదంట! ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపక్ అంట! అన్నదమ్ముల గొడపైనే జోరుగా చర్చంట! తండ్రి మోహన్ బాబు కూడా ఇదే విషయమై సీరియస్ కూడా అయ్యారంట!

మంచు వారింటి పంచాయితీ రోడ్డు మీద పడిదంట! ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపక్ అంట! అన్నదమ్ముల గొడపైనే జోరుగా చర్చంట! తండ్రి మోహన్ బాబు కూడా ఇదే విషయమై సీరియస్ కూడా అయ్యారంట! అయితే ఈ గొడవంతా.. సోషల్ మీడియాకెక్కడానికి కారణం ఎవరంట? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలంటా! మంచు మనోజ్‌ పెళ్లిలో అంతా హ్యాపీగానే కనిపించిన మోహన్ బాబు ఫ్యామిలీ.. తాజాగా గొడవలతో రోడ్డు మీద పడింది. అన్నదమ్ముల మధ్య జరిగిన వార్‌ త్రూ సోషల్ మీడియా బయటికి రావడంతో.. హాట్ టాపిక్‌ గా మారింది. అసలు విషయం ఏంటంటే..! మంచు మనోజ్‌కు క్లోజ్‌ ఫ్రెండ్ అయిన సారధిపై మార్చ్‌ 23న రాత్రి విష్ణు దాడి చేశారు. ఇక ఇది తెలిసిన మంచు మనోజ్‌ తన అక్క లక్ష్మీతో సారధి ఇంటికి చేరుకున్నారు. చేరుకోవడమే కాదు.. అక్కడే ఆవేశంగా ఉన్న తన అన్న విష్ణను వీడియో తీశాడు. వీడియో తీస్తూనే “ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్కడి పరిస్థితి” అంటూ విష్ణు గురించి వీడియోలో చెప్పారు. ఇక ఆ వీడియోను మంచు మనోజ్‌ తన స్టేటస్‌లో పెట్టడంతో.. ఇన్నాళ్లుగా వీరు మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బయటపడింది. ఒక్క సారిగా అందర్నీ షాకయ్యేలా చేసింది. అంతే కాదు.. మోహన్ బాబుకు కోపం తెప్పించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Manoj: మంచు విష్ణు ఇంటికి వచ్చి కొడుతున్నాడు !!

Keerthy Suresh: ధూం దాం చేసిన కీర్తి సురేష్.. ఎత్తిన బాటిల్ దించకుండా తాగిందిగా !!

Rana Daggubati-Naga Chaitanya: మొత్తానికి బావ బామ్మర్దులు కలిశారు !!

ఐదు పదులు దాటినా అదరహో అనిపిస్తున్న మహిళ !! సూపర్‌ ఉమన్‌ అంటూ కామెంట్లు

ఆచారం అంటూ.. స్టిక్‌ తీసుకొని వరుడ్ని చితకబాదిన వధువు

 

Published on: Mar 25, 2023 09:39 AM