Superstar Krishna Final Journey: ఎనభై వసంతాల సాహసికి సెలవు.. ఎవర్‌గ్రీన్ హీరో.. మన సూపర్‌స్టార్ కృష్ణ!
టాలీవుడ్ లెజండరీ నటుడు, సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి సూపర్‌స్టార్ అంతిమయాత్ర ప్రారంభమైంది.
ఆయన నటన నేర్చిన హీరో మాత్రమేకాదు..ఆడియన్స్‌ని మంత్రముగ్ధుల్ని చేసే మాంత్రికుడు కూడా! చూపులతో అందాన్ని తడమడం..కళ్లతోనే భావాలు పలికించడం కృష్ణకు తెలుసు! ఆయనతో నటించడానికి తపించని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి లేదు. ఆ మాట వేరు. ఆ చూపు వేరు. ఆ జోరు వేరు. ఆ స్టైల్ వేరు. అందుకే కృష్ణకు పర్యాయపదం..కృష్ణే!
లెక్కకు అందనన్ని సినిమాలు..! ఎన్నో శత దినోత్సవాలు జరుపుకొన్న అద్భుతం! విభిన్న తరహా పాత్రల్లో రాణించిన నట శేఖరుడు..మన సూపర్‌స్టార్ కృష్ణ! పౌరాణికం, జానపదం, సాంఘికం..సినిమా ఏదైనా..సాహసమే ఆయన ఊపిరి. తెలుగు తెరకు ఎన్నో టెక్నాలజీ సొబగులు అద్దిన ఆయన దార్శనికత అనన్య సామాన్యం! అనితర సాధ్యమైన విజయాలను అందుకున్న ఆ నిత్య సాహసికి టీవీ9 కన్నీటి నివాళి అర్పిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??
ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ కృష్ణ
Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో
ఘనంగా ట్రంప్ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!