Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??
హీరో కృష్ణ సరసన నటించిన హీరోయిన్ల సంఖ్య చాలా పెద్దది.. ఏ హీరో కూడా ఇంత మంది హీరోయిన్లతో నటించలేదేమో! అలనాటి జయలలిత, కేఆర్ విజయ, జయంతి, జమునలతో కూడా కృష్ణ నటించారు.
హీరో కృష్ణ సరసన నటించిన హీరోయిన్ల సంఖ్య చాలా పెద్దది.. ఏ హీరో కూడా ఇంత మంది హీరోయిన్లతో నటించలేదేమో! అలనాటి జయలలిత, కేఆర్ విజయ, జయంతి, జమునలతో కూడా కృష్ణ నటించారు. శారదతో రాధమ్మ పెళ్లిలో నటించారు. సుకన్య, సంధ్యారాణి, విజయలక్ష్మి, గీతాంజలి, రాజశ్రీ, చంద్రకళ, జ్యోతిలక్ష్మి, విజయలలిత, టి పద్మిని (కుట్టి పద్మిని), శుభ, వెన్నిరాడై నిర్మల, భారతి, కాంచన, ప్రభ, శ్రీప్రియ, గీత, కవిత, దీప, రజనీశర్మ, మధుమాలిని, రతి, విజయశాంతి, రాధ, అంబిక, సుజాత, మందాకిని, జరీనా వాహెబ్, సుమలత, భానుప్రియ, శోభన, యమున, రూప గంగూలి, మీనా, సుహాసిని, ఆమని, వర్ష, మాలాశ్రీ, రంభ, గౌతమి, రమ్యకృష్ణ, రవళి, రోజా, ఇంద్రజ, సంఘవి, ప్రేమ ఇలా చాలా మంది కృష్ణ సరసన నటించారు. ఆయనతో అత్యధిక సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది విజయనిర్మల. తర్వాతి స్థానం జయప్రదది. ఆ తర్వాతి స్థానం శ్రీదేవిది!. జయచిత్రతో కూడా కృష్ణ నటించారు. వయసులో తనకంటే పెద్ద అయిన జమునతో హీరో నటించాడు. పండంటి కాపురంలో ఓ రకంగా కృష్ణకు వదిన పాత్ర జమునది. గుమ్మడి ప్రేమిస్తాడు.. ఆ తర్వాత వచ్చిన దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఓ పాటలో తళుక్కున మెరుస్తుంది జమున. అటు పిమ్మట పెద్దలు మారాలి, గౌరి సినిమాల్లో కృష్ణ సరసన నటించింది.. 69లో వచ్చిన ముహూర్తబలంలో కూడా జమునే హీరోయిన్!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ కృష్ణ
Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో
ఘనంగా ట్రంప్ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

