NTR - Prashanth Neel: బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!

NTR – Prashanth Neel: బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!

Anil kumar poka

|

Updated on: Aug 08, 2024 | 6:21 PM

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా తన రేంజ్‌ ఏంటో ప్రపంచానికి చాటాడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రశాంత్‌ నీల్‌ అద్భుత దర్శకత్వం హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసి చూపించే విధానం ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. దీంతో ప్రశాంత్ నీల్‌ నుంచి వస్తున్న సినిమాలపై ఆకాశన్నంటే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే.. అప్పట్లోనే ప్రశాంత్‌ నీల్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా..

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా తన రేంజ్‌ ఏంటో ప్రపంచానికి చాటాడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రశాంత్‌ నీల్‌ అద్భుత దర్శకత్వం హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసి చూపించే విధానం ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. దీంతో ప్రశాంత్ నీల్‌ నుంచి వస్తున్న సినిమాలపై ఆకాశన్నంటే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే.. అప్పట్లోనే ప్రశాంత్‌ నీల్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందన్న వార్త ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా ఆ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేటే బయటికి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర మూవీతో బిజీగా ఉన్న వియషయం తెలిసిందే.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అటు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ పార్ట్‌2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వార్తల ప్రకారం ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్ ఎన్టీఆర్ 31 మూవీ షూటింగ్ ఈనెల 9వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రభాస్‌ డేట్స్‌ అడ్జెస్ట్ కాకపోవడంతో.. సలార్ 2 షూట్‌ ను పక్కు పెట్టి.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ సినిమా మొదలెట్టనున్నారనే టాక్ ఇండస్ట్రీలో వస్తోంది. అంతేకాదు వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి డ్రాగన్‌ అనే టైటిల్‌ను ఖరారు అయిందనే టాక్ కూడా వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.