Sania Mirza Assets: 210 కోట్లు.. లగ్జరీ కార్లు.! దిమ్మతిరిగేలా చేస్తున్న సానియా లైఫ్‌ స్టైల్‌.

Sania Mirza Assets: 210 కోట్లు.. లగ్జరీ కార్లు.! దిమ్మతిరిగేలా చేస్తున్న సానియా లైఫ్‌ స్టైల్‌.

Anil kumar poka

|

Updated on: Jan 25, 2024 | 8:59 AM

భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరు ఇప్పుడు ఎక్కువగా వార్తలలో నిలుస్తోంది. ఓ మాములు క్రీడాకారిణిగా ప్రారంభించిన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎన్నో టైటిళ్స్ సొంతం చేసుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‏ను ప్రేమ వివాహం చేసుకుని.. అప్పట్లో సంచలనంగా మారింది. ఇక దాదాపు 14 సంవత్సరాలపాటు వీరి వైవాహిక బంధం స్వస్తి చెబుతూ.. సానియా, షోయబ్ విడాకులు తీసుకోవడం.. షోయబ్ మరో పెళ్లి చేసుకోవడం కూడా..

భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరు ఇప్పుడు ఎక్కువగా వార్తలలో నిలుస్తోంది. ఓ మాములు క్రీడాకారిణిగా ప్రారంభించిన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎన్నో టైటిళ్స్ సొంతం చేసుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‏ను ప్రేమ వివాహం చేసుకుని.. అప్పట్లో సంచలనంగా మారింది. ఇక దాదాపు 14 సంవత్సరాలపాటు వీరి వైవాహిక బంధం స్వస్తి చెబుతూ.. సానియా, షోయబ్ విడాకులు తీసుకోవడం.. షోయబ్ మరో పెళ్లి చేసుకోవడం కూడా… ఇప్పుడు సంచలనంగానే మారింది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో సానియా, షోయబ్ ల గురించి అన్ని విషయాలు ట్రెండింగ్‏లో ఉన్నాయి. ఈ క్రమంలోనే సానియా మీర్జా విలాసవంతమైన జీవనశైలిని.. ఆమె కార్ల సేకరణతోపాటు మిగతా విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్‌ అండ్ నెటిజెన్స్‌. సెర్చ్‌ చేయడమే కాదు.. రిజెల్ట్‌ చూసి షాక్ కూడా అవుతున్నారు వీళ్లు.

నివేదికల ప్రకారం సానియా మీర్జా నికర విలువ దాదాపు 210 కోట్లు అట. అలాగే ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తోందట. అంతేకాకుండా ఆమె విలాసవంతమైన కార్ల సేకరణతోపాటు అనేక ఖరీదైన వస్తువులను కూడా కలిగి ఉన్నారట. అలాగే సానియాకు కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, BMW వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం వాటి విలువ 3 కోట్ల వరకు ఉంటుందట. ఇక ఇటీవల తన ప్రొపెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది సానియా. WTA సింగిల్స్ ర్యాంకింగ్‌లో టాప్ 30లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళ కూడా సానియానే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos