Balagam: గ్లోబల్‌ రేంజ్లో కూడా బజ్.. ఆస్కార్ దారిలో బలగం

Balagam: గ్లోబల్‌ రేంజ్లో కూడా బజ్.. ఆస్కార్ దారిలో బలగం

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Apr 07, 2023 | 11:07 AM

బలగం సినిమా... బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలుస్తోంది. ఓ పక్క ఓటీటీలో ఉన్నా.. కూడా.. థియేటర్లలో కిక్కిరిసి మరీ చూస్తున్న జనాల మనసులను గెలుచుకుంటూ పోతోంది.

బలగం సినిమా… బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలుస్తోంది. ఓ పక్క ఓటీటీలో ఉన్నా.. కూడా.. థియేటర్లలో కిక్కిరిసి మరీ చూస్తున్న జనాల మనసులను గెలుచుకుంటూ పోతోంది. ఊర్లలో తెరలు కట్టుకుని మరీ.. కలిసి కట్టుగా చూసే సినిమా మారిపోయింది. పిల్లా జల్లా ముసలీ ముతకా.. ఇలా అందర్నీ ఆకట్టుకుంటోంది. వారిలో భావోద్వేగాలను పుట్టేలా చేస్తోంది. మనుషుల మనస్తత్వాలను నిక్కచ్చిగా మరో సారి మనకే చూపిస్తోంది. ఇక దాంతో పాటే.. ఇప్పుడు గ్లోబల్‌ రేంజ్లో కూడా బజ్ చేస్తోంది. ఆస్కార్ దారిలో పయనిస్తోంది. ఎస్ ! కమెడియన్ జబర్దస్త్‌ వేణు డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ బలగం! ఎలాంటి అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా రిలీజ్‌ అయిన ఈసినిమా ఇప్పుడు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. బిగ్ హిట్ గా మారింది. అంతేకాదు.. ఇటీవల లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ పీచర్ ఫిల్మ్‌.. అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీగా కేటగిరీల్లో అవార్డు అందుకుంది. ఇక ఆ తరువాత వాషింగ్‌ టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా 4 కేటగిరీల్లో అవార్డు అందుకుంది. ఇలా ఈ సినిమా గ్లోబల్‌ రేంజ్ లో బజ్ చేయడం మొదలెట్టి.. ఇప్పుడు మరిన్ని అవార్డ్స్‌ అందుకునేలా కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ దారిలోనే నడుస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సుక్కు ఎప్పుడో చెప్పారు.. కానీ మనమే దసరా డైరెక్టర్‌ను గుర్తిచలే..

Dasara: గుండు గుత్తగా లేపేసిండు..100 కోట్లు కొల్లగొట్టిన దసరా !!

Published on: Apr 07, 2023 09:25 AM