Yash-Toxic: పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.

Yash-Toxic: పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.

Anil kumar poka

|

Updated on: Oct 03, 2024 | 9:48 AM

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. మలయాళానికి చెందిన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తోంది. యష్ నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార, కియారా అద్వానీ, కరీనాకపూర్ వంటి అందాల తారలు ఈ మూవీలో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. మలయాళానికి చెందిన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తోంది. యష్ నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార, కియారా అద్వానీ, కరీనాకపూర్ వంటి అందాల తారలు ఈ మూవీలో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే ‘టాక్సిక్’ సినిమాలో తాను నటిస్తున్నట్లు ఓ బ్రిటిష్ నటుడు కన్ఫర్మ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ‘టాక్సిక్’ సినిమాలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. టాక్సిక్’ సినిమాలో మీ పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నకు ‘అవన్నీ ఇప్పుడే చెప్పలేను, నా క్యారెక్టర్ గురించి ఓపెన్ గా మాట్లాడలేను, కాంట్రాక్ట్ లో ఉన్నాను, క్యారెక్టర్ గురించి ఎంత అడిగినా చెప్పలేను’ అని బెనెడిక్ట్ గారెట్ చెప్పారు.

అదే సమయంలో ‘యష్ గురించి చెప్పండి’ అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు, ‘యష్ అద్భుతమైన వ్యక్తి, నా కంటే అతని గడ్డం చాలా బాగుంది’ అని చెప్పాడు. గీతు మోహన్ దాస్ గురించి బెనెడిక్ట్ బదులిస్తూ, ‘నేను లేడీ డైరెక్టర్ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి, ఆమె సపోర్ట్, సలహాలు, ఉత్సాహం అద్భుతం’. ‘మీ ఫిజిక్ టాక్సిక్ సినిమాలో ఉండబోతుందా?’ అనే ప్రశ్నకు మీరు సినిమాలోనే చూడాలి అని అన్నారు బెనెడిక్ట్. అయితే యశ్‌ సినిమా మాత్రం 2025లో విడుదలవుతుందని హింట్ ఇచ్చారు ఈయన.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 03, 2024 09:48 AM