Pallavi Prashanth: గజ్వేల్‪‌ సాక్షిగా మాట నిలుపుకున్న పల్లవి ప్రశాంత్.! వీడియో.

Pallavi Prashanth: గజ్వేల్‪‌ సాక్షిగా మాట నిలుపుకున్న పల్లవి ప్రశాంత్.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Mar 16, 2024 | 1:06 PM

బిగ్ బాస్ సీజన్ 7 ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మధ్యలో పక్క ట్రాక్ లోకి వెళ్లినా చివరిలో బాగా ఆడి విన్నర్ గా నిలిచాడు. అయితే తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షలతో రైతులకు సాయం చేస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్.

బిగ్ బాస్ సీజన్ 7 ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మధ్యలో పక్క ట్రాక్ లోకి వెళ్లినా చివరిలో బాగా ఆడి విన్నర్ గా నిలిచాడు. అయితే తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షలతో రైతులకు సాయం చేస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్నా… దాని పై ఇంతవరకు ఎలాంటి ఊసు లేదు. దాంతో పల్లవి ప్రశాంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రశాంత్ ను చాలా మంది ట్రోల్ చేశారు.ఇచ్చిన మాట మర్చిపోయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. మొత్తానికి ఇప్పటికి పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రైతులకు తాను అందిస్తానన్న సాయం అందించాడు.

తాజాగా ప్రశాంత్ గజ్వేల్‪‌లోని కొల్గూర్‌ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి సాయం అందించాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరు పిల్లల కోసం లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ తో పాటు సందీప్ మాస్టర్ 25 వేలు సాయం అందించాడు. దీంతో పల్లవి ప్రశాంత్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. తిప్పరా మీసం అంటూ.. ఇచ్చిన మాట నిలుపుకున్నావ్ గ్రేట్ అంటూ.. కామెంట్స్ వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..