AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్‌ బిగ్ పంచ్‌.. అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్‌ వీడియో

బిగ్ బాస్‌ బిగ్ పంచ్‌.. అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్‌ వీడియో

Samatha J
|

Updated on: Nov 16, 2025 | 11:23 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారం ఎండింగ్ కు చేరుకుంది. ఇక ఈ సీజన్ లో కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ షోపై ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుతోంది. దీనికి తోడు పదో వారం నామినేషన్స్ ఈ సీజన్ లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా సాగాయి. ప్రస్తుతం హౌస్ లో ఉన్న మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ లో ఏకంగా పది మంది నామినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా హౌస్‌మేట్స్ అందరూ నేరుగా నామినేషన్స్ లోకి రావడంతో ఈ వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది.

తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, భరణి శంకర్, దివ్య నిఖిత, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్ లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ కావడం, అందులోనూ టాప్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఇప్పుడా ఓటింగ్ తీరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్‌ ప్రకారం పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరో టాప్ కంటెస్టెంట్ తనూజ రెండో స్థానానికి పడిపోయింది. మొన్నటివరకు లిస్ట్ లో ఉన్న రీతూ చౌదరి ఇప్పుడు మూడో ప్లేస్ కు వచ్చేసింది. అలాగే భరణి శంకర్ సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం భరణి నాలుగో ప్లేసులో కొనసాగుతున్నాడు. ఇక మిగిలిన వాళ్లు ఓటింగ్ గంట గంటకూ మారుతూ… ఉంది. దీంతో ఈవారం ఎలిమినేష్ అందరికీ షాకిచ్చేట్టు కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో

Follow Us