Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైఫ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్..అరెస్టైన వ్యక్తి నిందితుడు కాదా..?

సైఫ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్..అరెస్టైన వ్యక్తి నిందితుడు కాదా..?

Samatha J

|

Updated on: Jan 21, 2025 | 1:40 PM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్‌ ఇది. శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొచ్చిన వ్యక్తికి ..సైఫ్‌పై దాడితో ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు. అతడిని విడుదల చేశామన్నారు.. అసలు నిందితుల కోసం ప్రత్యేక బృందాల కోసం గాలిస్తున్నాయన్నారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్‌ 331(4), సెక్షన్‌ 311 కింద కేసు నమోదు చేశారు. దాడికి మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.దొంగతనం కోసమే దుండగుడు సైఫ్‌ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే నిందితులు పట్టుబడితే మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.

మరోవైపు సైఫ్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించినట్టు చెబుతున్నారు. అప్పటికే సైఫ్‌ చిన్న కుమారుడు గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి కేకలు వేసి అలారం మోగించింది. ఈ శబ్దాలు విని మేల్కొన్న సైఫ్‌ అలీ ఖాన్‌ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సైఫ్‌ను కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు.గురువారం తెల్లవారుజామున రెండున్నరకు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన్ను ముంబై లీలావతి ఆస్పత్రికి తరలించారు. దుండగుడు పారిపోయిన CCTV దృశ్యాలను పరిశీలిస్తున్నారు. 20కి పైగా పోలీసు బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయి. చివరకు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అనుమానితుడికి ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు పోలీసులు దృవీకరించారు.

మరిన్ని వీడియోల కోసం :

సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?

భయాందోళనలో బాలీవుడ్‌.. అక్కడ అసలేంజరుగుతోంది! వీడియో

సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?

కాగితాల్ని కాల్చేస్తున్న నీళ్లు..ఏంటీ మిస్టరీ..?