Allu Arjun: ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో బన్నీ సందడి.? బన్నీకి లైసెన్స్ వచ్చిందోచ్!

Allu Arjun: ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో బన్నీ సందడి.? బన్నీకి లైసెన్స్ వచ్చిందోచ్!

Anil kumar poka

|

Updated on: Mar 21, 2024 | 10:49 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. సాధారణంగా ఇండియాలో పుట్టి ఇతర దేశాలలో ఉంటున్న వారు... ఇక్కడి నుంచి వాహనాలు తీసుకెళ్లి విదేశాల్లో ట్రిప్ వేయాలనుకునే వారు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. గతంలో జపాన్‌లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ జరగనుందనే ప్రచారం జరిగింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. సాధారణంగా ఇండియాలో పుట్టి ఇతర దేశాలలో ఉంటున్న వారు… ఇక్కడి నుంచి వాహనాలు తీసుకెళ్లి విదేశాల్లో ట్రిప్ వేయాలనుకునే వారు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. గతంలో జపాన్‌లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ జరగనుందనే ప్రచారం జరిగింది. అక్కడ డ్రైవింగ్ అవసరమై ఈ లైసెన్స్ తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయనను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపారు. ఆర్టీఏ ఆఫీసులో సందడిగా మారింది. ఆర్టీఏ ఆఫీసులో అధికారులను కలిసి ఫార్మాలిటీస్ ప్రకారం డాక్యుమెంట్స్ ఫిల్ చేసి సైన్ చేశారు అల్లు అర్జున్ .ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ను చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాసేపు ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో ‘పుష్ప: ది రూల్‌’ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. యాగంటి క్షేత్రంలోని గుహలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామికి హీరోయిన్‌ రష్మిక మందన్నా బంగారు కిరీటాన్ని బహూకరించే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌తో ఆప్రాంతమంతా ప్రజలతో సందడిగా మారింది సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్‌’.. 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప: ది రైజ్‌’ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..