Rashmika Mandanna: ‘పుష్ప-2’లో రష్మిక లుక్ లీక్.. ఫొటోను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'పుష్ప-2' షూటింగ్ ఫొటోలు బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక మందాన లుక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోను అభిమానులు ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ ఫొటోలు బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక మందాన లుక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న నేషనల్ క్రష్ రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోను అభిమానులు ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు. యాగంటి ఆలయంలో షూటింగ్ విశేషాలను తన ఇన్‌స్టా స్టోరీలో రష్మిక అభిమానులతో ఇటీవల షేర్ చేసింది. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫొటోను కూడా షేర్ చేసింది. దేవాలయంలో మూవీ చిత్రీకరణ జరిగిందనీ యాగంటి అని పిలవబడే ఈ ఆలయ స్థల పురాణం నిజంగా అద్భుతమనీ రాసుకొచ్చింది. ఇక్కడి ప్రజల్ని వారి ప్రేమని మాటల్లో చెప్పలేం అంటూ చెప్పుకొచ్చింది.
కొన్ని రోజుల ముందు ‘పింక్‌విల్లా’తో ఇంటర్వ్యూలో ‘పుష్ప-2’లోని తన పాత్ర గురించి రష్మిక కొన్ని విషయాలు బయటపెట్టింది. మూవీలో పుష్ప భార్యగా తన పాత్ర బాధ్యతతో ఉంటుందనీ మొదటి భాగం కంటే రెండో భాగంలో చాలా డ్రామాతో పాటు పాత్రల మధ్య వైర్యం కూడా అదే స్థాయిలో ఉంటుందని రివీల్ చేసింది. పార్ట్-2లో అభిమానులు కోరుకునే మసాలా చాలా ఎక్కువగా ఉంటుందనీ తెలిపింది. 2021లో పుష్ప మొదటి పార్ట్.. ‘పుష్ప: ద రైజ్’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు హిందీలో భారీ వసూళ్లు రాబట్టింది. ఇక పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2’ ద రూల్ ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుకుమార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.