RC16: రామ్‌చరణ్‌ కొత్త సినిమా.! బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది''?

RC16: రామ్‌చరణ్‌ కొత్త సినిమా.! బుచ్చిబాబు సన దర్శకత్వంలో “పెద్ది”?

Anil kumar poka

|

Updated on: Mar 21, 2024 | 9:49 AM

ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌, సుకుమార్‌, చిరంజీవి, అల్లు అరవింద్‌, బోనీకపూర్‌తోపాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడారు.

ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌, సుకుమార్‌, చిరంజీవి, అల్లు అరవింద్‌, బోనీకపూర్‌తోపాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడారు. అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారన్నారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా… గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. జాన్వీకపూర్‌ కథానాయిక. రెహమాన్ మ్యూజిక్‌ అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. RC16గా ఇది ప్రచారంలో ఉంది. ‘పెద్ది’ టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ మొదలు కానుంది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ పనుల్లో బిజీగా ఉండగా, ‘దేవర’ కోసం జాన్వీ వర్క్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..