Allu Arjun: అభిమానులతో కలిసి సినిమా చూసిన అల్లు అర్జున్‌ రియాక్షన్‌ వీడియో వైరల్..

Allu Arjun: అభిమానులతో కలిసి సినిమా చూసిన అల్లు అర్జున్‌ రియాక్షన్‌ వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Dec 06, 2024 | 11:36 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ద‌ర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన‌ 'పుష్ప2: ది రూల్' ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేసింది. బుధ‌వారం రాత్రి 9.30 గంట‌ల బెనిఫిట్ షోతో పాటు తరువాత.. మార్నింగ్ షోలు కూడా ప‌డిపోయాయి. దీంతో థియేటర్ల వ‌ద్ద బ‌న్నీ ఫ్యాన్స్ కోలాహ‌లం నెల‌కొంది. కాగా, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేట‌ర్‌లో ఫ్యామిలీ, అభిమానుల‌తో క‌లిసి అల్లు అర్జున్ బుధవారం రాత్రి ఈ సినిమాను వీక్షించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ‘పుష్ప2: ది రూల్’ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంగా గంగ‌మ్మ జాత‌ర సీన్‌లో ఆయ‌న న‌ట‌న‌ను చూసిన అభిమానులు స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు. ఫ్యాన్స్‌ రియాక్షన్‌కు అల్లు అర్జున్‌ మురిసిపోయారు. దాంతో బ‌న్నీ వారికి కృత‌జ్ఞత‌లు తెలుపుతూ.. మ‌నం విజ‌యం సాధించామంటూ విక్టరీ సింబ‌ల్‌తో అభివాదం చేశారు. ప్రస్తుతం దీని తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఈ మూవీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఇప్పటికే ప్రీమియ‌ర్ షోలు చూసిన వారు సినిమా బాగుంద‌ని అంటున్నారు. గంగ‌మ్మ జాత‌ర ఎపిసోడ్ మూవీలో టాప్‌నాచ్ అని టాక్‌. మ‌రోవైపు బుధ‌వారం సాయంత్రం నుంచి పుష్ప-2, అల్లు అర్జున్, వైల్డ్‌ఫైర్ పుష్ప హ్యాష్ ట్యాగ్‌లు ఎక్స్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.