Pushpa 2 The Rule: తగ్గేదేలే.! టాలీవుడ్ గేమ్ ఛేంజరా పుష్పరాజ్.?

Pushpa 2 The Rule: తగ్గేదేలే.! టాలీవుడ్ గేమ్ ఛేంజరా పుష్పరాజ్.?

Anil kumar poka

|

Updated on: Dec 06, 2024 | 11:48 AM

ఏ రంగంలో అయినా ఓ గేమ్ ఛేంజర్ ఉంటుంది. అంటే అంతవరకు మూస పద్దతిలో వెళ్లే దానిని పక్కకునెట్టి కొత్తదారిని చూపిస్తుంది. టాలీవుడ్ కు పుష్పా అలాంటిదేనా? ఎందుకంటే రికార్డుల రారాజుగా మారిన పుష్పరాజ్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ కొత్త మార్గాన్ని సెట్ చేశారా? మార్కెట్ ను పెంచుకోవడానికి పుష్ప టీమ్ అనుసరించిన స్ట్రాటజీ.. ఇప్పుడు రాబోయే సినిమాలకు బాగా ఉపయోగపడుతుందా?

ఏ రంగంలో అయినా ఓ గేమ్ ఛేంజర్ ఉంటుంది. అంటే అంతవరకు మూస పద్దతిలో వెళ్లే దానిని పక్కకునెట్టి కొత్తదారిని చూపిస్తుంది. టాలీవుడ్ కు పుష్పా అలాంటిదేనా? ఎందుకంటే రికార్డుల రారాజుగా మారిన పుష్పరాజ్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ కొత్త మార్గాన్ని సెట్ చేశారా? మార్కెట్ ను పెంచుకోవడానికి పుష్ప టీమ్ అనుసరించిన స్ట్రాటజీ.. ఇప్పుడు రాబోయే సినిమాలకు బాగా ఉపయోగపడుతుందా? అలా అయితే.. పుష్పాకి ముందు.. పుష్పా తరువాత అనేలా టాలీవుడ్ పరిస్థితి మారబోతోందా? నిజానికి ఈ ప్రశ్నలపై తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా మూవీని తీయడం, నార్త్ మార్కెట్ నూ కొల్లగొట్టడం, కమర్షియల్ గా హిట్ కొట్టి.. సక్సెస్ కావడం ఇవన్నీ టాలీవుడ్ కు బాహుబలి ఎప్పుడో నేర్పించింది. మరిప్పుడు పుష్పా స్పెషలేంటి అనుకోవచ్చు. కానీ పుష్పా కూడా మార్కెట్ స్ట్రాటజీలో హిట్ కొట్టింది. అందుకే బడ్జెట్ కు మించి బిజినెస్ చేయడంలో కాని, కలెక్షన్స సునామీని రప్పించడంలో కాని, పుష్పా-2 కోసం మూడేళ్ల పాటు ప్రేక్షకులతో వెయిట్ చేయించడంలో కాని తిరుగులేని స్ట్రాటజీని అమలు చేసింది.

శ్రీవల్లి సాంగ్ కు 165+ మిలియన్ వ్యూస్
సామి సామి పాటకు 224+ మిలియన్ వ్యూస్
ఊ అంటావా మావ పాటకు 190+ మిలియన్ వ్యూస్
ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటకు 73+ మిలియన్ వ్యూస్

ఏదైనా పనిని స్వీట్ తో స్టార్ట్ చేస్తే.. ఆ పనంతా దిగ్విజయంగా జరుగుతుంది అంటారు. సినిమాకు స్వీట్ అంటే పాటలే కదా. నిజానికి ఆ సినిమా గురించి ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ లోనూ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి, పబ్లిసిటీ క్యాంపైన్ ను రన్ చేయడానికి ఇవే పెద్ద అస్త్రాలు. పుష్ప1 సాంగ్స్ హిట్ టాక్.. సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చిందని మర్చిపోకూడదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. దేవిశ్రీ ప్రసాద్ కు ఏకంగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డును అందించాయి.చంద్రబోస్ మ్యాజిక్ నిజంగానే బాగా పనిచేసింది. ఊ అంటావా పాటను ఆడియన్స్ హమ్ చేయకుండా ఉండలేకపోయారు. శ్రీవల్లి సాంగ్ కు యూట్యూబ్ లో 165+ మిలియన్, సామి సామి పాటకు 224+ మిలియన్, ఊ అంటావా మావ పాటకు 190 + మిలియన్, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటకు 73+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డులే చెబుతాయి అవి ఎంత హిట్టయ్యాయో. దీంతో సినిమాకు మ్యూజిక్ ఎంత ప్రాణమో, ఆడియన్స్ ను థియేటర్లకు ఎలా రప్పించాలో ఒక వే చూపించాయి.

సూసేకి పాటకు అన్ని భాషల్లో కలిపి 270 మిలియన్లకు పైగా వ్యూస్
కిస్సిక్ పాటకు అన్ని భాషల్లో కలిపి 70+ మిలియన్లకు పైగా వ్యూస్

ఇక పుష్ప-2 చూస్తే.. పుష్ప-పుష్ప-పుష్పరాజ్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 150+ మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. సూసేకి పాటకు అన్ని భాషల్లో కలిపి 270 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక కిస్సిక్ పాట అయితే చెప్పక్కరలేదు. దక్షిణాదిలో ఫాస్ట్ గా వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ ఇదే. విడుదలై ఒక్కరోజు కూడా కాకముందే.. 25+ మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 70+ మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించింది. పీలింగ్స్ సాంగ్ చూస్తే.. దాదాపు 27 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. సో.. ఒక సాంగ్ ను వివిధ భాషల్లో మార్కెట్ చేసుకోగలిగితే.. కోట్లాది మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. ఎక్స్ ట్రా మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా టాలీవుడ్ పాటల క్రేజ్ ను, మార్కెట్ ను పుష్పా పెంచిందనే చెప్పాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.