Manchu Lakshmi: భర్తతో దూరంగా ఉంటున్నారు ఎందుకు? మంచు లక్ష్మీ షాకింగ్ ఆన్సర్
మంచు ఇంట నడుస్తున్న వివాదంతో సబంధం లేకుండా.. తన పనిలో తాను కంటిన్యూ అవుతున్న మంచు లక్ష్మీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలో పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉండే ఈమె.. తాజాగా తన భర్త గురించి మాట్లాడారు. అంతేకాదు తాను భర్తతో దూరంగా ఉంటారంటూ సోషల్ మీడియాలో వినిపించే ఓ వార్తకు క్లారిటీ కూడా ఇచ్చారు.
లక్ష్మీ ప్రసన్న పెళ్లి గురించి నెటిజన్స్ ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. పెళ్లి తర్వాత మంచు లక్ష్మీ భర్తకు దూరంగా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఎప్పుడు లక్ష్మీ ప్రసన్న తన పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఆయన ఫారెన్ లో ఐటీ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారంటూ తన భర్త గురించి చెప్పిన మంచు లక్ష్మీ.. తాము ఎంతో అన్యోన్యంగా ఉంటామని తెలిపారు. అలాగే.. సమాజంలో ప్రశాంతంగా బతికేలా, స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పుకొచ్చారు. న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో జీవిస్తామని.. స్వేచ్ఛ, ప్రైవసీ, పర్సనల్ రెస్పాన్సిబిటీ లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. తమకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నామని.. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ.. మా పీస్‌ను కోల్పోమని చెప్పారు మంచు లక్ష్మీ. అంతేకాదు తాను తన భర్తతోనే కలిసి ఉంటున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రెండు నెలలు తన భర్తతో కలిసి ఉన్నానని, అలాగే తన కూతురు ఇప్పుడు భర్త దగ్గర ఉందని కూడా చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెల్ఫీ పేరుతో ముద్దుకు ప్రయత్నం! హీరోయిన్‌కు చేదు అనుభవం
‘జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్’ పవన్‌తో స్నేహం పై ఆనంద్ సాయి ఎమోషనల్
Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరిచిన పృథ్వీ! అప్పుడే మళ్లీ రచ్చ షురూ…
ఊరికే పనిచేస్తా.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్.. ఓ టెక్కీ ఆవేదన
బర్త్‌డే పార్టీలో కేకుపై క్యాండిల్ వెలిగించిన యువతి.. క్షణాల్లో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
