Moong Sprouts: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!

Moong Sprouts: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!

Anil kumar poka

|

Updated on: Jul 15, 2024 | 9:09 AM

సాధారణంగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, వడ, దోశ ఇలాంటి ఆహారాలే తీసుకుంటారు. కానీ ఆరోగ్య రిత్యా ఉదయం ఫలహారంగా మొలకెత్తిన పెసర్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొలకెత్తిన పెసర్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తింటే అలసటను దూరం చేసుకోవచ్చని, గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

సాధారణంగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, వడ, దోశ ఇలాంటి ఆహారాలే తీసుకుంటారు. కానీ ఆరోగ్య రిత్యా ఉదయం ఫలహారంగా మొలకెత్తిన పెసర్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొలకెత్తిన పెసర్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తింటే అలసటను దూరం చేసుకోవచ్చని, గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. రోజువారీగా మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సహా ఎన్నెన్నో ఈ మొలకెత్తిన పెసర్లను తినడం ద్వారా సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ అలసటను పోగొట్టేందుకు, మెరుగైన నిద్రకు తోడ్పడతాయని చెప్పారు. మొలకెత్తిన పెసర్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తినడం ద్వారా జీర్ణవ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చంటున్నారు.

ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుందని, తద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు తోడ్పడి, రక్తం గడ్డకట్టే ముప్పును తప్పించుకునేందుకు దోహదం చేస్తాయట. మొలకెత్తిన పెసర్లలోని ఫైబర్ కంటెంట్ ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పుల వంటి జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తాయని వివరించారు. చర్మ సంరక్షణకు తోడ్పడి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవని తెలిపారు. కంటిచూపు కూడా పెరుగుతుందట. మధుమేహ బాధితులకు మొలకెత్తిన పెసర్లు దివ్యౌషధంగా పనిచేస్తాయట. రక్తంలో చక్కెర స్థాయులను సమతుల్యం చేయగల సామర్థ్యం మొలకెత్తిన పెసర్లకు ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ గుప్పెడు గింజలు తింటే గుండె పదిలంగా ఉంటుందని, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని వివరించారు. సంతానోత్పత్తికి, గర్భిణీలకు మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యాన్నిస్తాయని, అధిక బరువును తగ్గించుకోవడానికి తోడ్పడతాయని తెలిపారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ఇది వైద్య చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.