తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఐదు రూపాయలకే బిర్యానీ అంటూ ఓ వ్యాపారి ఆఫర్ పెట్టాడు. దీంతో పెద్ద ఎత్తున క్యూ కట్టారు బిర్యానీ ప్రియులు. దీనికోసం ఏకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి మరి వేడి వేడి బిర్యానీని ఐదు రూపాయలకే ఇచ్చేశారు.