ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో పర్యటించిన ఆమె అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఓ సారి తాను డైమండ్ రింగ్ అడిగితే.. నువ్వే డైమండ్.. నీకెందుకు డైమండ్ రింగ్ అని అన్నారని నవ్వుతూ చెప్పారు. కష్టపడకుండా వచ్చేది ఏదీ ఉండదని విద్యార్థులు గుర్తించాలన్నారు.