Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు, యాత్రికులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. దీనికి తోడు తుఫాను ప్రభావంతో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. కొండపై మంచు కమ్ముకోవడం, దీంతో పాటు భారీ వర్షాలు పడుతుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు

|

Updated on: Dec 05, 2023 | 9:43 PM

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు, యాత్రికులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. దీనికి తోడు తుఫాను ప్రభావంతో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. కొండపై మంచు కమ్ముకోవడం, దీంతో పాటు భారీ వర్షాలు పడుతుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బలమైన ఈదురు గాలులు, వర్షానికి తిరుమలలోని పలు ప్రాంతాలలో చెట్లు కొమ్మలు, విరిగి పడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గాలకు అనుమతి నిరాకరించారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్డు ద్వారా వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి, టర్నింగ్‌ దగ్గర జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అటు తిరుమలలో పడుతున్న భారీ వర్షాలకు గోగర్భం, పాపవినాశనం, పసుపుధార, ఆకాశగంగ జలాశయాలకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: క్లీన్‌గా హాయ్‌ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి

Follow us
వాక్యూమ్ క్లీనర్లపై అదిరే డిస్కౌంట్.. అమెజాన్ లో 62 శాతం తగ్గింపు
వాక్యూమ్ క్లీనర్లపై అదిరే డిస్కౌంట్.. అమెజాన్ లో 62 శాతం తగ్గింపు
తెలిసి చేసే ఈ వాస్తు తప్పులే.. ఇంట్లో గొడవలకు కారణవుతాయి
తెలిసి చేసే ఈ వాస్తు తప్పులే.. ఇంట్లో గొడవలకు కారణవుతాయి
అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్..
అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్..
డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు
డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు
ప్రమాదం పొంచి ఉంది అలర్టవ్వడండి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ప్రమాదం పొంచి ఉంది అలర్టవ్వడండి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
వైధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి రోహిణి కామెంట్స్.
వైధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి రోహిణి కామెంట్స్.
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మళ్లీ రుణమాఫీ రగడ.. హరీష్ రావు ఫైర్
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మళ్లీ రుణమాఫీ రగడ.. హరీష్ రావు ఫైర్
మీ పెట్‌ డాగ్‌ ఇలా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!
మీ పెట్‌ డాగ్‌ ఇలా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!
మీరు తాగుతోన్న పాలు.. కల్తీవా, మంచివా.? ఇలా తెలుసుకోండి..
మీరు తాగుతోన్న పాలు.. కల్తీవా, మంచివా.? ఇలా తెలుసుకోండి..
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..