Rain Alert: ఉపరితల ఆవర్తనం.. ఏపీలో మూడు రోజుల పాటు వానలే వానలు.!

Rain Alert: ఉపరితల ఆవర్తనం.. ఏపీలో మూడు రోజుల పాటు వానలే వానలు.!

Anil kumar poka

|

Updated on: Nov 09, 2024 | 4:54 PM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణ మధ్య బంగాళాఖాతం పై సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశము ఉంది. ఇటు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌లోనూ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇటు రాయలసీమలోనూ బుధవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. అలాగే, గురువారం, శుక్రవారం కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.