చికున్ గున్యా.. ముప్పులో భారత్ !! మేలుకోకుంటే.. మునగటం ఖాయం
ఇటీవల వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి చికున్ గున్యా. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మరింత భయాందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా భారత్‌పై చికున్ గున్యా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుందని తాజా అధ్యయనం వెల్లడించింది. భారత్‌లో ఏటా 50 లక్షలకు పైగా ప్రజలు దీని బారిన పడతారని, దీనివల్ల ప్రజలు, ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలికంగా భారీ మూల్యం చెల్లించుకోవటంతో బాటు ఆరోగ్య వ్యవస్థల మీద తీవ్ర ఒత్తిడికి కారణం కానుందని హెచ్చరించింది.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ & ట్రాపికల్ మెడిసిన్, నాగసాకి విశ్వవిద్యాలయం, సియోల్‌లోని ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో చికున్‌గున్యా బాధితుల్లో దాదాపు సగం భారతీయులే.. ఉండగా తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.44 కోట్ల మంది దీని బారిన పడుతోండగా, వారిలో 51 లక్షల మంది భారతీయులే కావటం.. ఆందోళన కలిగించే అంశమని ఈ పరిశోధనలో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు. ఈ వ్యాధి ఇప్పుడు వ్యాపిస్తున్న తీరున.. కొత్త ప్రాంతాలకు పాకితే.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.49 కోట్ల మంది బాధితులుగా మారతారని అంచనా వేశారు. అదే గనుక నిజమైతే.. ఒక్క భారత్‌లోనే 1.21 కోట్ల మంది దీని బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు లెక్కగట్టారు. పరిశోధకుల అంచనా ప్రకారం.. చికున్ గున్యా బాధిత దేశాలలో భారత్, బ్రెజిల్, ఇండోనేషియాలు దీర్ఘకాలం పాటు ఈ సమస్యను ఎదుర్కొనే తొలి మూడు దేశాలుగా ఉండబోతున్నాయి. అదే సమయంలో చికున్ గున్యా సోకిన వారిలో సగం మందికి దీర్ఘకాలిక వైకల్యాలు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనివల్ల ఆయా దేశాల శ్రామిక శక్తి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని, ఆర్థికంగానూ నష్టదాయకంగా పరిణమించే ప్రమాదం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు చాలా సాధారణం. ఇదే చికెన్‌గున్యా ఎక్కువగా వ్యాపించడానికి ప్రధాన కారణం. అయితే, ఇక్కడ చికెన్‌గున్యా వల్ల పెద్దగా ప్రమాదం లేనప్పటికీ, జాగ్రత్తగా ఉండాలి. చికెన్‌గున్యా వ్యాధి ఎడిస్ ఈజిప్టి, ఎడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమలు పగటిపూట ఎక్కువగా చురుకుగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉన్న దోమ ఎవరినైనా కుడితే, వైరస్ వారి రక్తంలోకి ప్రవేశించి శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా శరీరంలోని కీళ్ళు, కండరాలు, నరాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి, బలహీనత కలుగుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇన్నిరోజులూ ఆ మందుబాబులు తాగింది ఇదా
సీతాఫలం తింటే చర్మం మెరుస్తుందా..!
సరిపడా నీరు తాగితే బీపీ తగ్గుతుందా ??
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

