AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరిమళించిన మానవత్వం.. వైరల్ అవుతోన్న వీడియో

పరిమళించిన మానవత్వం.. వైరల్ అవుతోన్న వీడియో

Phani CH
|

Updated on: Oct 06, 2025 | 7:35 PM

Share

తెల్లవారితే బ్రతుకుపోరాటం. తన కుటుంబాన్ని పోషించుకోడానికో.. తనను తాను బ్రతికించుకోడానికో వీధుల్లో రకరకాలుగా కష్టపడుతూ ఎందరో మనకు కనిపిస్తుంటారు. వారిలో ఎందరో చిన్నారులు ఉంటారు.. అలాగే, అవసాన దశలో ఆసరాలేక పొట్టపోసుకోడానికి నానా అవస్థలు పడుతున్న వృద్ధులూ కనిపిస్తుంటారు. అలాంటి ఓ దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ వృద్ధురాలిపట్ల ఆ యువకుడు చూపిన ఆదరణ అందరిలో మానవత్వాన్ని మేల్కొలుపుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఓ రైల్వేస్టేషన్‌ బయట రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు రెండు వెయింగ్‌ మెషిన్లు పెట్టుకొని కూర్చుని ఉంది. ఎవరైనా వచ్చి ఆ మెషిన్‌మీద తమ వెయిట్‌ చూసుకొని డబ్బులిస్తే ఆమె పొట్ట నిండుతుంది. పైన వర్షం పడుతోంది. రోడ్డంతా తడిచిపోయింది. అయినా అక్కడినుంచి ఆమె కదలలేదు. గొడుగు వేసుకొని ఏ ఒక్కరైనా రాకపోతారా అని ఎదురుచూస్తోంది. ఎవరూ రాకపోవడంతో నిరాశతో అలసిపోయిన తన ముఖాన్ని చీరకొంగుతో తుడుచుకుంటూ మౌనంగా దేవుణ్ణి ప్రార్ధిస్తుంది. ఇంతలో అక్కడకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ వ్యక్తి అక్కడి వెయింగ్‌ మెషిన్‌పై తన బరువు చూసుకున్నాడు. అనంతరం ఎంత అని ఆ వృద్ధురాలిని అడిగాడు. ఆమె 5 రూపాయలు అని చేతి వేళ్లను చూపించింది. అతను ఆమె ముందు మోకాళ్లపై కూర్చుని కొంత డబ్బును ఆమె చేతిలో పెట్టాడు. ఆ డబ్బు తీసుకోడానికి ఆమె సంకోచించింది. అతను ఏదో చెప్పి తీసుకోమని ఆమె చేతిలో డబ్బు ఉంచాడు. కృతజ్ఞతతో అతనికి ఆ వృద్ధురాలు చేతులు జోడించింది. అతను వారించి, తనను ఆశీర్వదించమని కోరాడు. నిండుమనసుతో ఆమె అతన్ని దీవించింది. ఆ వ్యక్తి మరింత హుందాగా వ్యవహరిస్తూ ఆ బామ్మ చిన్నబుచ్చుకోకుండా ఆమె పక్కనే కూర్చుని ఆమెతో కలిసి టీ తాగాడు. ఆమెను ప్రేమగా హత్తుకుని తలపై ముద్దు పెట్టాడు. అనంతరం ఆ బామ్మకు నమస్కరించి వెళ్లబోతే ఆ బామ్మ అతని తలపై చేతులుంచి దీవించి పంపించింది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోను మూడు మిలియన్లకు పైగా వీక్షించారు. మానవత్వం ఇంకా బతికే ఉందని, మనకు కావలసిందల్లా ఒకరికొకరు సహాయం చేసుకోవడమేనని స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యముడు లంచ్‌ బ్రేక్‌‌లో ఉన్నట్టున్నాడు.. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలతో బయటపడ్డాడు

రూ. 5 వేలకు కోటిన్నర ప్రాపర్టీ మీ సొంతం

దారుణం.. దసరాకు సెలవు ఇవ్వలేదని పసికందు ఉసురు తీశారు

విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి

మాయదారి మహమ్మారికి నవ వధువు బలి