యముడు లంచ్ బ్రేక్‌లో ఉన్నట్టున్నాడు.. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలతో బయటపడ్డాడు
అతివేగం ప్రమాదకరం అని భారీ వాహనాల వెనుక స్లోగన్స్ రాసుకుంటారు కానీ అది చదివిన తర్వాతైనా.. నెమ్మదిగా వాహనాలు నడుపుదామని కొందరు వాహనదారులు అసలు అనుకోరు. ఇక కొందరైతే రయ్‌య్..మంటూ దూసుకెళ్తూ తమ డ్రైవింగ్ ప్రతిభనంతా చూపించాలనుకుని ప్రమాదాల్లో పడుతుంటారు. ఒక్కోసారి వారిలో కొందరు ఊహించనిరీతిలో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంటారు.
తాజాగా ఓ యువకుడు మిల్లర్ లారీని ఓవర్ టేక్ చేయాలనుకుని దానికింద పడిపోయాడు. అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు యమధర్మరాజు లంచ్ బ్రేక్‌కు వెళ్ళినట్టున్నాడు అంటున్నారు. కాకినాడ జిల్లా తునికి చెందిన నరేంద్ర అనే యువకుడు ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అతడు.. తేటగుంట జాతీయ రహదారిమీదుగా ఓ ఈవెంట్ షూట్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో తన బైక్ ముందు వెళ్తున్న మిల్లర్‌ను వెనుక ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. మరుక్షణం అతనిపైనుంచి మిల్లర్ దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఆ ప్రమాదాన్ని చూసిన వారంతా ఆ యువకుడు చనిపోయాడని భావించారు. కానీ లక్కీగా అతడు ప్రాణాలతో బయటపడటం చూసి అందరూ ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 5 వేలకు కోటిన్నర ప్రాపర్టీ మీ సొంతం
దారుణం.. దసరాకు సెలవు ఇవ్వలేదని పసికందు ఉసురు తీశారు
విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

