AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి

విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి

Phani CH
|

Updated on: Oct 06, 2025 | 6:41 PM

Share

పశ్చిమ బెంగాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానలకు మిరిక్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రకృతి బీభత్సానికి పర్యాటక ప్రాంతాలైన మిరిక్, కుర్సియాంగ్‌లను కలిపే కీలకమైన దూదియా ఐరన్ బ్రిడ్జి పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి.

కుర్సియాంగ్ సమీపంలోని 110వ జాతీయ రహదారి పై ఉన్న హుస్సేన్ ఖోలా వద్ద కూడా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారులు బురదతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్‌బెహార్, జల్‌పైగురి, అలీపుర్‌దువార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో సోమవారం ఉదయం వరకు కుండపోత వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్‌లో పేర్కొంది. జార్ఖండ్‌ పశ్చిమ ప్రాంతం, దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడి బీహార్ వైపు కదులుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. దక్షిణ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, బీర్‌భూమ్, నాడియా జిల్లాల్లో కూడా సోమవారం వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయని, అత్యధికంగా బంకురాలో 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాయదారి మహమ్మారికి నవ వధువు బలి

దడ పుట్టిస్తున్న బంగారం ధర.. మండిపోతున్న వెండి..

రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలిస్తే..

సమయం వృథా చేస్తున్నారా ??ఈ టిప్స్‌ పాటిస్తే సక్సెస్‌ మీదే

వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీ కోసమే