AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలిస్తే..

రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలిస్తే..

Phani CH
|

Updated on: Oct 06, 2025 | 4:32 PM

Share

మనిషి ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో ఔషధాలు ప్రకృతి సహజసిద్ధంగా మనకు అందిస్తుంది. దాదాపు అన్ని రకాల పండ్లు ప్రొటీన్‌, విటమిన్లు కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఔషధగుణాలు మెండుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఉసిరికాయ ఒకటి. ఉసిరికాయను ఔషధాల గనిగా చెబుతారు. రోజూ ఒక్క ఉసిరికాయ తింటే చాలు అనారోగ్యం దరిచేరదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, బరువును నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. ఆరోగ్య నిపుణులు ప్రకారం, ఉసిరికాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉసిరికాయ రసం నిత్యం తాగడం వల్ల శరీరంలో పలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడానికి, మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. ఉసిరి రసం బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించి, పేగులను శుభ్రపరుస్తుంది. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు పంపుతుంది. ఉసిరికాయ వల్ల అన్ని రకాల పైత్యాలు, కఫం తగ్గుతాయి. ఇది మేధస్సును పెంచడంలో సహాయపడుతుంది. ఉసిరి తినడం వల్ల వీర్య పుష్టి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా ఉసిరిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈసమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమయం వృథా చేస్తున్నారా ??ఈ టిప్స్‌ పాటిస్తే సక్సెస్‌ మీదే

వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీ కోసమే

బలమైన రోగ నిరోధక శక్తి కోసం 3 సూపర్ ఫ్రూట్స్