దూసుకొస్తున్న తోకచుక్క.. భూమికి ప్రమాదం తప్పదా
‘వేగంగా దూసుకొస్తున్న ఓతోక చుక్క త్వరలోనే భూమిని ఢీకొట్టబోతుంది.. దానితో భూమికి ముప్పే’ అంటూ ఇటీవల జరిగిన ప్రచారం అంతా హంబక్ అంటోంది నాసా. 3 ఐ అట్లాస్ అనే తోకచుక్కతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. సెకనుకు 61 కిలోమీటర్ల అసాధారణ వేగంతో ఈ తోక చుక్క ప్రయాణిస్తున్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రస్తుతం ఈ తోకచుక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. దాంతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా క్లారిటీ ఇచ్చింది. మన సౌర వ్యవస్థకు చెందని ఖగోళ వస్తువులను నాసా గుర్తించడం ఇది మూడోసారి. గతంలో 2017లో ‘ఔమువామువా’, 2019లో ‘2ఐ/బోరిసోవ్’ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా అట్లాస్ తోకచుక్క సౌరకుటుంబం ఆవల నుంచి వస్తున్న మూడో ఖగోళ వస్తువుగా చెబుతున్నారు. ఈ తోకచుక్కను తొలిసారిగా ఈ ఏడాది జులై 1న చిలీలోని రియో హర్టాడోలో ఉన్న అట్లాస్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తోకచుక్క సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ దీని వేగం మరింత పెరుగుతుంది నాసా పేర్కొంది. అక్టోబర్ 30 నాటికి ఇది సూర్యుడికి అత్యంత సమీపంగా.. అంటే సుమారు 21 కోట్ల కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. హబుల్ టెలిస్కోప్ అంచనా ప్రకారం, ఈ తోకచుక్క సైజు 440 మీటర్ల నుంచి 5.6 కిలోమీటర్ల మేర ఉంటుందని, దాని చుట్టూ ధూళి, గ్యాస్‌తో దీర్ఘ గోళాకారంలో కమ్ముకుని ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. మొదటగా ఇది.. భూమికి దగ్గరగా వచ్చింది జూలై 21, 2025న అనీ, అప్పడు దానికి భూమికి మధ్య గల దూరం 27 కోట్ల కి.మీ ఉందని వారు తెలిపారు. ఇది భూమి-సూర్యుడి మధ్య దూరం కంటే 1.5 రెట్లు ఎక్కువ గనుక భూమికి దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని నాసా తెలిపింది. హబుల్, జేమ్స్ వెబ్ వంటి శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా దీని గమనాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ చివరిలో సూర్యుడి దగ్గర నుంచి ప్రయాణించి, మార్చి 2026 నాటికి బృహస్పతిని దాటి తిరిగి మన సౌర వ్యవస్థ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోల్డ్ రిఫ్‌ను బ్యాన్ చేయడం హర్షణీయం
పరిమళించిన మానవత్వం.. వైరల్ అవుతోన్న వీడియో
యముడు లంచ్ బ్రేక్‌లో ఉన్నట్టున్నాడు.. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలతో బయటపడ్డాడు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్

