సీతాఫలం తింటే చర్మం మెరుస్తుందా..!
వింటర్ సీజన్‌లో దొరికే సీతాఫలం అంటే ఇష్టపడనివారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా ఈ పండ్లు తింటారు. ఈ పండు టేస్ట్‌లో బెస్ట్.. ఇక పోషకాలు ఈ పండులో మెండుగానే ఉంటాయి. సీతాఫలంలో సి-విటమిన్‌తోపాటు ఎ, బి, కె విటమిన్లూ, ప్రొటీన్లూ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలం చర్మసంరక్షణలో ద బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ఫేస్ మాస్క్‌గా వాడితే, ఇది చర్మం వాపును తగ్గిస్తుంది, మొటిమలు, ముడతలను నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మానికి తేమను అందించి, యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండును పాలతో కలిపి ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడి, ఫ్రీ రాడికల్స్‌ను తటస్థంగా ఉంచుతాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇందులో ఉండే హైడ్రేటింగ్ ఏజెంట్లు పొడిబారిన చర్మానికి తేమను అందించి, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, సీతాఫలం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సీతాఫలంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా సీతాఫలంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సరిపడా నీరు తాగితే బీపీ తగ్గుతుందా ??
దూసుకొస్తున్న తోకచుక్క.. భూమికి ప్రమాదం తప్పదా
కోల్డ్ రిఫ్‌ను బ్యాన్ చేయడం హర్షణీయం
పరిమళించిన మానవత్వం.. వైరల్ అవుతోన్న వీడియో
యముడు లంచ్ బ్రేక్‌లో ఉన్నట్టున్నాడు.. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలతో బయటపడ్డాడు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

