Telecom Companies: బాదుడే.. బాదుడు..10% టారిఫ్‌లు పెంపుటారిఫ్‌లు పెంచనున్న టెలికాం కంపెనీలు..

Telecom Companies: బాదుడే.. బాదుడు..10% టారిఫ్‌లు పెంపుటారిఫ్‌లు పెంచనున్న టెలికాం కంపెనీలు..

Anil kumar poka

|

Updated on: Jan 01, 2023 | 9:59 AM

చందాదారులపై మరోసారి భారం మోపనున్నాయి టెలికాం కంపెనీలు. కొత్త ఏడాది మార్చి నాటికి 10 శాతం టారిఫ్‌లు పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ తెలిపింది.


చందాదారులపై మరోసారి భారం మోపనున్నాయి టెలికాం కంపెనీలు. కొత్త ఏడాది మార్చి నాటికి 10 శాతం టారిఫ్‌లు పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ తెలిపింది. మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ, నంబర్ పోర్టబిలిటీ, 5జీ సేవలు కారణంగా టెలికం సంస్థలపై భారం పెరుగుతోంది. ఫలితంగా టారిఫ్ పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని జెఫెరీస్ అభిప్రాయపడింది. ఎయిర్‌టెల్, జియో సంస్థలు 2023, 2024, 2025 ఆర్థిక సంవత్సరాల చివరి త్రైమాసికంలో టారిఫ్‌లు పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. రాబడి తగ్గడం, పెట్టుబడుల వ్యయం పెరగడం, వినియోగదారుడిపై వచ్చే సగటు ఆదాయం తగ్గడం వంటివి టారిఫ్‌లు పెంపునకు కారణమని టెలికం నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం జియో 0.8 శాతం, వొడాఫోన్ ఐడియా ఒక శాతం, ఎయిర్‌టెల్ 4 శాతం ఏఆర్‌పీయూను పెంచాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 01, 2023 09:58 AM