TVS Apache: టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్.. అదిరిపోయే న్యూ లుక్‌లో.. ధర ఎంతటే..
కొత్త కలర్, అత్యాధునిక ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4V లాంచ్ చేసింది టీవీఎస్ మోటర్స్ కంపెనీ. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను బైక్‌లో పొందుపరిచారు.
కొత్త కలర్, అత్యాధునిక ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4V లాంచ్ చేసింది టీవీఎస్ మోటర్స్ కంపెనీ. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను బైక్‌లో పొందుపరిచారు. ఇది 250 ఆర్‌పీఎం వద్ద 17.39 బీహెచ్‌పీ పవర్, 7250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్‌లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో అందుబాటులోకి తెచ్చారు. డ్యూయల్-టోన్ సీటు, ఎడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్లు ఉన్నాయి. అంతేకాదు అర్బన్, స్పోర్ట్ , రెయిన్ ఇలా మూడు రైడ్‌మోడ్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. వీటితో పాటు TVS Smart కనెక్టివిటీ, LED హెడ్‌ల్యాంప్, డేటైమ్ రన్నింగ్ లైట్ తో వస్తోంది. ఈ 2023 స్పెషల్ ఎడిషన్ వెర్షన్ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో 1.3 లక్షల రూపాయలుగా ఉంది. TVS అపాచీ RTR సిరీస్ బైక్‌లు అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ సెంట్రిక్‌గా ముందంజలో ఉన్నాయనీ, కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ పేర్కొన్నారు. రేసింగ్ అనుభవంతో స్పెషల్ ఎడిషన్‌ని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..